Pakistan Parliament Dissolved: గడువుకు ముందే పాకిస్థాన్‌ పార్లమెంటు రద్దు, త్వరలోనే కొలువుదీరనున్న ఆపద్ధర్మ ప్రభుత్వం

పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ (Pakistan National Assembly) రద్దు చేయాలని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) చేసిన సిఫార్సు మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్‌ అల్వీ అందుకు అంగీకరించారు. గడువుకు కొన్ని గంటల ముందే అక్కడి ప్రభుత్వం రద్దయినట్లయ్యింది.

Pakistan PM Shehbaz Sharif. (Photo Credits: Twitter | ANI)

Lahore, August 10: పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ (Pakistan National Assembly) రద్దు చేయాలని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) చేసిన సిఫార్సు మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్‌ అల్వీ అందుకు అంగీకరించారు. గడువుకు కొన్ని గంటల ముందే అక్కడి ప్రభుత్వం రద్దయినట్లయ్యింది.వాస్తవంగా ఆగస్టు 12 వరకు గడువు ఉంది. కాగా త్వరలోనే ఆపద్ధర్మ ప్రభుత్వం కొలువుదీరనుంది.

దీంతో ఎన్నికలను వచ్చే 90 రోజుల్లో పూర్తిచేసేందుకు వెసులుబాటు లభించినప్పటికీ.. ఇవి మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌పై (Imran Khan) ఎన్నికల సంఘం ఐదేళ్ల వేటు వేయడంతో అక్కడి రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం పాక్‌ జాతీయ అసెంబ్లీ రద్దుకావడంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పాలనా వ్యవహారాలు ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్వహించనుంది.

ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌ఖాన్‌పై అయిదేళ్ల పాటు నిషేధం, తోషాఖానా అవినీతి కేసు నేపథ్యంలో పాక్ ఈసీ కీలక నిర్ణయం

తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు అనుభవిస్తోన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ఎన్నికల సంఘం ఐదేళ్ల వేటు వేసింది. అయితే, ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇస్లామాబాద్‌ హైకోర్టులో ఇమ్రాన్‌ ఖాన్‌ అప్పీల్‌ చేశారు. అక్కడ ఉపశమనం లభించకపోతే.. వచ్చే ఎన్నికలకు ఇమ్రాన్‌ దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక 76 ఏళ్ల పాకిస్థాన్ చరిత్రలో కేవలం మూడుసార్లు మాత్రమే పాకిస్థాన్‌ పూర్తిస్థాయి (ఐదేళ్ల) పాలనను నడిపించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Year Ender 2024: దేశంలో ఈ ఏడాది అత్యధికంగా పన్ను చెల్లించిన సెలబ్రిటీ ఎవరో తెలుసా, అల్లు అర్జున్ ఎంత ట్యాక్స్ కట్టాడో తెలుసుకోండి, పూర్తి వివరాలు ఇవిగో..

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Share Now