Puffer Fish: ఈ చేపల కూర తినకండి, విషపూరితమైన పఫర్‌ చేప కూర తిని మహిళ మృతి, కోమాలో ఆమె భర్త, మలేషియాలో విషాదకర ఘటన

మలేషియాలో విషపూరితమైన చేప కూరను తిని ఓ మహిళ మృతి చెందగా ఆమె భర్త ప్రస్తుతం కోమాలో ఉన్నాడు.ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Puffer Fish . (Unsplash/Representative pic)

మలేషియాలో విషపూరితమైన చేప కూరను తిని ఓ మహిళ మృతి చెందగా ఆమె భర్త ప్రస్తుతం కోమాలో ఉన్నాడు.ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటన వివరాల్లోకెళితే.. మార్చి 25న ఒక వృద్ధుడు స్థానిక చేపల మార్కెట్‌లోని షాపు నుంచి విషపూరితమైన పఫర్‌ చేప (Puffer Fish) ను కొని ఇంటికి తెచ్చాడు. జపాన్‌లో ఎక్కువగా ఈ ఫిష్ ని తింటారు. అతని భార్య లిమ్‌ సీవ్‌ గ్వాన్‌ (83) చేపలను శుభ్రం చేసి కూర చేసింది.

షాకింగ్ న్యూస్.. బాలుడి మలద్వారంలోకి చొచ్చుకుపోయిన గునపం.. నాలుగు గంటల పాటు డాక్టర్ల శస్త్ర చికిత్స.. తర్వాత ఏమైంది?

తిన్న తర్వాత 83 ఏళ్ల భార్యతోపాటు ఆ వృద్ధుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరూ వణికిపోవడంతోపాటు శ్వాస అందక ఇబ్బందిపడ్డారు. గమనించిన కుమారుడు తల్లిదండ్రులను వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయితే అదే రోజు సాయంత్రం తల్లి లిమ్‌ సీవ్‌ గ్వాన్‌ మరణించింది. కోమాలో ఉన్న తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే వృద్ధాప్యం వల్ల ఆయన కోలుకుని ఆరోగ్యంతో బయటపడటం కష్టమని వైద్యులు తెలిపారు. పఫర్ ఫిష్ తినడం వల్ల ఫుడ్‌ పాయిజన్‌ అయి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

అయితే తన తండ్రి చాలా ఏళ్లుగా చేపల మార్కెట్‌లోని ఆ షాపు నుంచి ఇలాంటి చేపలను చాలాసార్లు కొన్నారని, ఇలా ఎప్పుడూ జరుగలేదని కుమార్తె తెలిపింది. రుచికరమైన ఈ చేపను కొని తెచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకునే వ్యక్తి తన తండ్రి కాదని అతడు వాపోయింది. ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందిస్తూ.. దంపతులు తిన్న చేపల వివరాలు సేకరించినట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం, అప్పుడే పుట్టిన శిశువును నోట కరుచుకుని ఈడ్చుకెళ్లిన వీధి కుక్క, శిశువు మృతి

కాగా పఫర్ ఫిష్‌లో టెట్రోడోటాక్సిన్, సాక్సిటాక్సిన్ అనే ప్రాణాంతక విషపూరితాలు ఉంటాయని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఫ్రీజ్‌ చేయడం లేదా వండటం వల్ల చేపలోని ఆ విష పదార్థాలు నాశనం కావని పేర్కొంది. పఫర్‌ చేపల నుంచి ఈ విష పదార్థాలను ఎలా తొలగించి.. వండాలనే దానిపై శిక్షణ పొంది అత్యంత నిపుణత కలిగిన చెఫ్‌లకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది.