Credits: Twitter

New Delhi, April 3: కొన్నిసార్లు జరిగిన అనుకోని ప్రమాదాలు (Accidents) వైద్య శాస్త్రంలో కూడా కొత్త సవాళ్లను విసురుతాయి. ఇదీ అలాంటి ఘటనే. ప్రమాదవశాత్తూ రేకుల మీద నుంచి కిందకు జారిపడిన ఓ బాలుడి (Boy) మలద్వారంలోకి (Anus) గునపం చొచ్చుకుపోగా, వైద్యులు (Doctors) నాలుగు గంటల పాటు శ్రమించి దాన్ని చకచక్యంగా బయటకు తీసిన అరుదైన ఘటన ఒడిశాలోని కొంధమాల్‌ జిల్లా కోటగడ్‌ ఠాణా పరిధిలోని సువర్ణగిరిలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే, ఈ ప్రాంతానికి చెందిన సనాతన పటగురు కుమారుడు శక్తి పటగురు (16) శనివారం స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. తరగతి గదులపైకి ఎక్కి సిమెంట్‌ రేకులు తొలగిస్తుండగా ఓ రేకు విరిగిపోయి కిందకు జారాడు. అదే సమయంలో అక్కడే ఓ కార్మికుడు గునపం పట్టుకుని నిల్చున్నాడు.

SSC Exams Starts Today: తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. ఎగ్జామ్స్ రాయనున్న 4.94 లక్షల మంది విద్యార్థులు.. 8.30 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి.. తొలి రోజు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి.. హాల్ టికెట్ చూయిస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం.. పరీక్ష కేంద్రంలో కాపీయింగ్ జరిగితే ఇన్విజిలేటర్లదే బాధ్యత

కిందపడుతున్న బాలుడు సరిగ్గా ఆ గునపం మీద పడ్డాడు. దీంతో బాలుడి మలద్వారంలోకి అది చొచ్చుకుపోయింది. చికిత్స నిమిత్తం శక్తిని కుటుంబసభ్యులు బలిగుడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ఎమ్కేసీజీ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నాలుగు గంటలపాటు ఎంతో శ్రమించి, శస్త్రచికిత్స చేసి, గునపాన్ని తొలగించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉంది.

Viral Video: బావి పనులకు లంచం డిమాండ్.. అధికారి కార్యాలయం ముందు రూ. 2 లక్షలు వెదజల్లిన సర్పంచ్.. ఇంటర్నెట్ ను కుదిపేస్తున్న వీడియో ఇదిగో!