Mumbai, April 3: ప్రభుత్వ కార్యాలయాల్లో (Government Offices) ఏ పని జరుగాలన్నా లంచం (Bribe) ఇవ్వాల్సిందేనని మరోసారి రుజువైంది. అయితే, లంచం అడిగిన ఓ అధికారికి యువ సర్పంచ్ (Sarpanch) ఇచ్చిన ఝులక్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నది. మహారాష్ట్రలోని (Maharastra) ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఓ వ్యక్తి కరెన్సీ నోట్లను వెదజల్లుతున్న వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పులంబ్రీ పంచాయతీ సమితి పరిధిలోని గోవరాయ్ పయాగ్ గ్రామానికి 20 వ్యవసాయ బావులు మంజూరయ్యాయి. ఒక్కో బావికి రూ. 4 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులను త్వరగా ప్రారంభించాలని బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి (బీడీవో) జ్యోతి కవడదేవిని గ్రామ సర్పంచ్ మంగేష్ సాబ్లే (24) కోరారు. అయితే, పనులు ప్రారంభించాలంటే ఒక్కో బావికి రూ. 48 వేలు సమర్పించుకోవాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. రైతులు పేదలని, లంచం ఇచ్చుకోలేరని ఆయన ప్రాధేయపడినా ఆమె వినిపించుకోలేదు. డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతాయని తేల్చి చెప్పారు.
#ViralVideo | Sarpanch in #Maharashtra resorts to unique protest against corruption.
He throws nearly Rs 2 lakh worth currency notes on Panchayat office in Maharashtra's Chhatrapati Sambhajinagar district. pic.twitter.com/FGT9KwgxBL
— Nazaket Rather (@RatherNazaket) April 1, 2023
స్పందించిన మంత్రి
దీంతో ఆమెకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న సర్పంచ్ మంగేష్ రూ. 100, రూ. 500 నోట్లతో రూ. 2 లక్షలను దండగుచ్చి మెడలో వేసుకుని కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అందరూ చూస్తుండగానే తనకు ఎదురైన అనుభవం గురించి చెబుతూ దండలోంచి నోట్లు ఒక్కొక్కటిగా తీస్తూ వెదజల్లారు. దీంతో స్పందించిన మంత్రి గిరీష్ మహాజన్ బీడీవో జ్యోతి కవడదేవిని సస్పెండ్ చేసి దర్యాప్తుకు ఆదేశించారు.