H5N8 Strain in Humans: మానవాళిపై మరో కొత్త వైరస్ దాడి, రష్యాలో జంతువుల నుంచి మానవుల శరీరంలోకి H5N8 వైరస్‌, డిసెంబర్‌లో పక్షుల్లో బయటపడిన వైరస్, అప్రమత్తం అయిన రష్యా

మాన‌వాళికి మ‌రో ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ర‌ష్యా హెచ్చ‌రించింది. ప్ర‌పంచంలోనే తొలిసారి హెచ్‌5ఎన్‌8 ర‌కం ఏవియ‌న్ ఫ్లూ (Avian influenza) మ‌నుషుల‌కు సోకిన‌ట్లు ఆ దేశం వెల్ల‌డించింది. ఈ మేర‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)‌ను కూడా అప్ర‌మత్తం చేసింది.

Bird Flu (Photo Credits: IANS|File)

Moscow, Feb 21: ప్రపంచాన్ని ఇప్పుడు మరో మహమ్మారి ఆందోళనకు గురి చేస్తోంది. మాన‌వాళికి మ‌రో ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ర‌ష్యా హెచ్చ‌రించింది. ప్ర‌పంచంలోనే తొలిసారి హెచ్‌5ఎన్‌8 ర‌కం ఏవియ‌న్ ఫ్లూ (Avian influenza) మ‌నుషుల‌కు సోకిన‌ట్లు ఆ దేశం వెల్ల‌డించింది. ఈ మేర‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)‌ను కూడా అప్ర‌మత్తం చేసింది.

కోట్లాది పక్షులను బలిగొన్న బర్డ్ ఫ్లూ రకానికి చెందిన వైరస్ రష్యాలో ఓ వ్యక్తికి సోకింది. ఈ విషయాన్ని అధికారికంగా నిర్దారించిన రష్యా శాస్త్రవేత్తలు, ఇన్ ఫ్లూయెంజా ఏ వైరస్ లోని హెచ్5ఎన్8 రకం తొలిసారిగా మానవునిలో కనిపించిందని, వెంటనే ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు తెలియజేశామని పేర్కొంది.

దక్షిణ రష్యా పరిధిలోని పౌల్ట్రీలో పనిచేసే ఏడుగురిలో ఈ కొత్త వైరస్‌ను (H5N8 Strain in Humans) గుర్తించారు. కోళ్ల నుంచి మనుషులకు వైరస్‌ సోకిన తొలి కేసుగా ఈ ఘటన నిలిచిందని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారి అన్నాపొపొవా వెల్లడించారు. దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించామని తెలిపారు. కోళ్లను ప్రత్యక్షంగా తాకడం ద్వారా, అపరిశుభ్ర వాతావరణంలో ఉండటం వల్ల ఈ వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని అన్నారు.ఒకరిలో తీవ్రమైన హెచ్5ఎన్8 వైరస్ (H5N8 Strain) కనిపించిందని, ఇదే వైరస్ ను (Bird Flu Outbreak) డిసెంబర్ లో పక్షుల్లో గుర్తించామని తెలిపారు.

దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు, కీలక ఆదేశాలు జారీ చేసిన యడ్డీ సర్కారు, భారత్‌లో తాజాగా 14,264 మందికి కరోనా, ఏపీలో కొత్తగా 54 కోవిడ్ కేసులు, తెలంగాణలో తాజాగా 163 మందికి కరోనా

ఇప్పటికే ఈ ఇన్ ఫ్లూయెంజా వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందిందని పేర్కొన్న అన్నా పొపోవా, ఇంతవరకూ ఈ వైరస్ మానవులకు సోకినట్టుగా ప్రపంచంలో ఎక్కడా నిర్దారణ కాలేదని గుర్తు చేశారు. ఇది శాస్త్రవిజ్ఞాన ప్రపంచానికి మరో సవాల్ కాకముందే అన్ని ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వైరస్ మానవుల్లో మరింత మ్యూటేషన్ చెందే ప్రమాదం ఉందని, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

ఇక రష్యా లాబొరేటరీ నుంచి తమకు సమాచారం అందిందని స్పష్టం చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దీనిపై మరింత లోతుగా పరిశోధిస్తున్నామని పేర్కొంది. ఇది మానవుల నుంచి మానవులకు వ్యాపిస్తుందా? అన్న విషయమై ఇంకా స్పష్టత లేదని అన్నారు. కోళ్లు తదితర జంతువులతో నేరుగా కాంటాక్ట్ ఉన్న వారికే ఇది సోకే ప్రమాదం ఉందని వెల్లడించింది. కాగా, గతంలో మానవులకు హెచ్5ఎన్1 ఇన్ ఫ్లూయెంజా వేరియంట్ వైరస్ సోకిన వేళ, తీవ్రమైన వ్యాధి లక్షణాలు కనిపించిన వారిలో 60 శాతం మంది మృత్యువాత పడిన విషయాన్ని గుర్తు చేసింది.

విరుచుకుపడుతున్న కొత్త వేరియంట్లు, భారత్‌లో ఏకంగా ఐదు వేల రకాల కరోనా స్ట్రెయిన్లు, సంచలన వివరాలను వెల్లడించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు

ఫ్రెంచ్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ (సీఎన్‌ఆర్‌ఎస్‌) పరిశోధకుడు ఫ్రాంకోయిస్‌ రెనాడన్‌ మాట్లాడుతూ.. ఈ కొత్త స్ట్రెయిన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటికే దీనిపై తాము ప్రయోగాలు మొదలుపెట్టామని తెలిపారు. కరోనా ప్రపంచానికి వేగంగా స్పందించడం నేర్పిందని, కొత్త వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మరోవైపు రష్యాకు చెందిన వెక్టర్‌ స్టేట్‌ వైరాలజీ అండ్‌ బయో టెక్నాలజీ సెంటర్‌ కరోనా వైరస్‌కు టీకా అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త బర్డ్‌ ఫ్లూ స్ట్రెయిన్‌కు తాము వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని వెక్టర్‌ చీఫ్‌ రినాట్‌ మక్యుటోప్‌ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ వైర‌స్ ఉన్న ప‌క్షులు, ప‌శువుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న మ‌నుషుల‌కు ఈ వైర‌స్ సోకే అవ‌కాశం ఉంటుంద‌ని, ఇది మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కు సోక‌ద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో స్ప‌ష్టం చేసింది.