
Hyderabad, Feb 17: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఒకవైపు బర్డ్ ఫ్లూ (Bird flu) భయాలు వణికిస్తున్న వేళ.. యూపీలో ఆందోళన కలిగించే ఘటన ఒకటి వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ లో కోళ్ల లోడ్ తో వెళ్తున్న ఒక ట్రక్కు రోడ్డు మీద బోల్తా కొట్టింది (Chicken Hunt On Road). డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకొని కోళ్లతో ఉన్న ట్రక్కునంతా ఖాళీ చేశారు. దొరికిన వారికి దొరికన్నీ కోళ్లను పట్టుకుని పండగ చేసుకున్నాడు. డ్రైవర్, క్లీనర్ కు గాయాలైనా వారిని కాపాడే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానలో చేర్చారు. బర్డ్ ఫ్లూ భయం లేకుండా గ్రామస్థులు ఇలా కోళ్లను తీసుకువెళ్ళడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kannauj, UP: A pickup truck carrying chickens from Amethi to Firozabad overturned on the Kannauj expressway after the driver fell asleep. Videos of people looting chickens went viral. Police and UPEIDA personnel intervened, dispersing the crowd, while the injured were… pic.twitter.com/FF6lRshsvp
— IANS (@ians_india) February 15, 2025
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయాందోళనలు
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయాందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు సమీప ప్రాంతాల్లోని కోళ్లఫారాల్లో మరణ మృదంగం కొనసాగుతుంది. చూస్తుండగానే లక్షలాది కోళ్లు కుప్పకూలిపోతున్నాయి. కానూరు, వేల్పూరులో ఏకంగా ఐదు లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. 15 రోజులుగా వణికిస్తున్న ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ (బర్డ్ ఫ్లూ) కారణంగానే ఈ కోళ్లు మృతి చెందాయి. కోళ్లకు వైరస్ సోకుతుండటంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. దీంతో చికెన్ ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఏపీలో పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సరిహద్దుల్లో చికెన్ లారీలను అధికారులు నిలిపెస్తున్నారు.
బయటపడ్డ కుళ్లిన చికెన్
హైదరాబాద్ (Hyderabad)) లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అన్నా నగర్ చికెన్ సెంటర్స్ లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు. రెండు షాపుల్లో తనిఖీలు చేయగా సుమారు ఐదు క్వింటాళ్ల కుళ్ళిన చికెన్ కనిపించింది. అధికారులు ఈ కుళ్లిన చికెన్ను సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. ఈ చికెన్ ఎప్పటి నుంచి నిల్వ ఉంచుతున్నారు? దేనికోసం వాడనున్నారు? ఎక్కడికి సరఫరా చేయనున్నారు? అనే అంశాలపై అధికారులు దృష్టిసారించారు.