Ministry of Sex in Russia: రష్యాలో శృంగార మంత్రిత్వ శాఖ.. జననాల రేటు పెంచేందుకే.. అసలేంటీ విషయం??

అయితే, శృంగార మంత్రిత్వ శాఖ అనేది ఎప్పుడైనా విన్నారా? అయితే, ఈ శాఖ ఏర్పాటుకు రష్యా ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది.

Representational Image (Photo Credits: Pixabay)

Newdelhi, Nov 10: హోంశాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, రక్షణశాఖ, ఆర్ధిక శాఖ ఇలాంటివాటి గురించే విన్నాం. అయితే, శృంగార మంత్రిత్వ (Ministry of Sex) శాఖ అనేది ఎప్పుడైనా విన్నారా? అయితే, ఈ శాఖ ఏర్పాటుకు రష్యా ప్రభుత్వం (Russia) సమాయత్తం అవుతున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా జననాల రేటు పడిపోవడం, మరోవైపు ఉక్రెయిన్‌ తో యుద్ధం కారణంగా సంభవిస్తున్న ప్రాణనష్టంతో రష్యాలో పెద్దయెత్తున ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం జననాల రేటు పెంచేందుకు రెడీ అవుతున్నది. అందులో భాగంగా శృంగారం కోసం ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది.

మళ్లీ వాన పిలుపు.. రానున్న 24 గంటల్లో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

సాన్నిహిత్యం కోసం..

జననాల రేటు పెంచడంలో భాగంగా రష్యా ప్రభుత్వం వినూత్న చర్యలను చేపట్టింది. జంటల మధ్య సాన్నిహిత్యం పెరుగడానికి రాత్రివేళ ఇంటర్నెట్‌ పూర్తిగా ఆఫ్‌ చేయడం, కరెంటు తీసేయడం (Power Supply Off) వంటి చర్యలు చేపట్టింది. కాగా, 1999 తర్వాత తొలిసారి ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో జననాల రేటు దారుణంగా పడిపోయింది.

అలర్ట్.. హైదరాబాద్‌ లో రేపు తాగునీరు బంద్.. ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు నీళ్లు రావన్న అధికారులు.. ఎందుకంటే??



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif