Andhra Pradesh Heavy rains for another 3 days

Vijayawada, Nov 10: నైరుతి బంగాళాఖాతంలో (Bay of Bengal) రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. రానున్న రెండురోజుల్లో పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల మీదుగా ఈ ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొన్నారు. అల్పపీడనం నేపథ్యంలో రేపు, ఎల్లుండి, ఆ మరుసటి రోజు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు.

అలర్ట్.. హైదరాబాద్‌ లో రేపు తాగునీరు బంద్.. ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు నీళ్లు రావన్న అధికారులు.. ఎందుకంటే??

ఐఎండీ హెచ్చరికలు

వర్షాల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ (ఐఎండీ) (IMD) హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది.

బైక్‌ పై ఆడుకుంటూ కూర్చున్న చిన్నారి ప్రమాదవశాత్తూ రోడ్డుపైకి.. అప్పుడే ట్రక్కు రావడంతో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..!