Russia Shooting: కాల్పులతో దద్దరిల్లిన యూనివర్సిటీ, 8 మంది మృతి, మరింత మందికి గాయాలు, నిందితుడిని పట్టుకున్న పోలీసులు, రష్యా పెర్మ్ స్టేట్ యూనివర్సిటీలో ఘటన

రష్యా పెర్మ్ క్రాయ్ ప్రాంతంలోని పెర్మ్ స్టేట్ యూనివర్సిటీలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో 8 మంది (8 Killed After Gunman Opens Fire) చనిపోయారు. పలువురు గాయపడ్డారు.

Representational image. (Photo Credit: GoodFreePhotos)

Moscow, September 20: ర‌ష్యాలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌ వేళ కాల్పుల మోతతో (Russia Shooting) దద్దరిల్లింది. రష్యా పెర్మ్ క్రాయ్ ప్రాంతంలోని పెర్మ్ స్టేట్ యూనివర్సిటీలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో 8 మంది (8 Killed After Gunman Opens Fire) చనిపోయారు. పలువురు గాయపడ్డారు.

యూనివర్సిటీ (Perm State University) భవనంలోకి చొరబడిన సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులకు భయపడిన కొందరు విద్యార్ధులు యూనివర్సిటీ ఆడిటోరియంలో దాక్కున్నారు. మరికొందరు కిటికీల ద్వారా తప్పించుకునేందుకు యత్నిస్తూ భవనంపై నుంచి దూకేశారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు.కాల్పులకు పాల్ప‌డిన దుండ‌గుడిని ప‌ట్టుకున్నారు. ఓ బిల్డింగ్ నుంచి అనేక మంది విద్యార్ధులు భ‌యంతో పారిపోతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌ అయ్యాయి. పెర్మ్ స్టేట్ యూనివ‌ర్సిటీలో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. ఇది అత్యంత ఓల్డ్‌ యూనివ‌ర్సిటీ.

పళ్ల‌తో కొరికి రిబ్బన్ కట్ చేసిన పాకిస్తాన్ మంత్రి ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్, క‌త్తెర‌ పదునుగా లేకపోవడంతో ఘటన, వైరల్ అవుతున్న క్లిప్

వీలైతే క్యాంప్‌ను వ‌దిలి వెళ్లండి లేదా రూమ్‌ల్లోనే తాళాలు వేసుకుని ఉండాల‌ని ఇవాళ ఉద‌యం యూనివ‌ర్సిటీ ఓ అల‌ర్ట్ ఇచ్చింది. దీంతో పాటుగా పెర్మ్ న‌గ‌రంలో ఉన్న వైద్య అధికారులు సుమారు 10 మంది మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. మరో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కువ సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించి ఉంటాయ‌ని పోలీసులు భావిస్తున్నారు.

Here's Video 

ఘటనపై రష్యా ఇన్వెస్టిగేషన్ కమిటీ దర్యాప్తు చేపట్టింది. నిందితుడు కాల్పులకు తెగబడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిందితుడు క్యాంపస్‌లోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు.. విద్యార్థులు కిటికీలోంచి దూకుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.