Russia-Ukraine War: బిడ్డ ఏడుస్తున్నా వదల్లేదు, నా భర్తను చంపేసి ఆ శవం పక్కనే నన్ను దారుణంగా రేప్ చేశారు, రష్యా సైనికులు దురాగతాలను వెలుగులోకి తెచ్చిన ఉక్రెయిన్ మహిళ
ఆమె ఆరోపణలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Kyiv, March 29: రష్యా ఉక్రెయిన్‌పై వైమానికి దాడులతో యుద్ధం (Russia-Ukraine War) కొనసాగిస్తూనే ఉంది. ఒక పక్క శాంతి చర్చలు అంటూనే మరోపక్క యథావిధిగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ యుద్ధంలో రష్యా సైనికులు దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు ఒక ఉక్రెయిన్ మహిళ రష్యా సైనికులు తన ఇంటిపై దాడి చేశారని తెలిపింది. తన భర్తను కాల్చిచంపిన కొద్ది సేపటికే (e Russian soldiers who killed her husband) తన నాలుగేండ్ల కుమారుడు ఏడుస్తున్నా లెక్కచేయకుండా ఇద్దరు రష్యన్ సైనికులు తనకు తుపాకీ గురిపెట్టి లైంగిక దాడికి (Ukrainian woman recounts being raped by the Russian soldiers) పాల్పడ్డారని ఉక్రెయిన్ మహిళ వెల్లడించారు. ఆమె ఆరోపణలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
మార్చి 9న రష్యన్ సైనికులు కాల్పులతో హోరెత్తిస్తూ తమ ఇంట్లోకి చొచ్చుకువచ్చారని తొలుత తమ పెంపుడు కుక్కను కాల్చిచంపిన వారు గేటు ముందు తన భర్తపై కాల్పులు జరిపారని భర్త కోసం తాను ఇంటి బయటకు రాగా ఆయన గేటు వద్ద విగతజీవిగా పడిఉన్నాడని ఆమె గుర్తుచేసుకున్నారు. భర్త గురించి అడగ్గా ఆయన నాజీ కావడంతో చంపేశామని సైనికులు బదులిచ్చారని తెలిపారు. ఆపై రష్యన్ సైనికులు తన నోరు నొక్కి తుపాకీ గురిపెట్టి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు. సైనికులు తనను దుస్తులు తొలగించాలని బెదిరించారని ఆపై ఒకరి తర్వాత మరొకరు ఇద్దరు సైనికులు దారుణానికి తెగబడ్డారని తెలిపారు. తన బిడ్డ ఏడుస్తుండగా లోపలికి వెళ్లి అతడిని ఊరుకోబెట్టి తిరిగి రావాలని వారు హుకుం జారీ చేశారని గుర్తు చేసుకున్నారు.
ఆ సమయంతో తన నాలుగేళ్ల కొడుకు భయంతో బాయిలర్ రూమ్‌లో గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్నాడంటూ ఆనాటి ఘటనను గుర్తుతెచ్చుకుంటూ కన్నీటిపర్యంతమైంది. ఆ తర్వాత తాము అక్కడి నుంచి భయంతో పారిపోయామని, తన భర్త శవాన్ని కూడా అక్కడే వదిలేశామని చెప్పింది. తమ గ్రామం ఇప్పటికీ రష్యన్ సైనికుల చెరలో ఉన్నందున తిరిగి గ్రామానికి వెళ్లబోనని, భర్త శవాన్ని పాతిపెట్టబోమని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అధికారులు ఆమె ఆరోపణలపై విచారణ చేపట్టారు.