Saudi Arabia Ends Petrodollar Deal with US: అమెరికా డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టిన సౌదీ అరేబియా, పెట్రో-డాలర్ ఒప్పందాన్ని పునరుద్ధరించబోమని కీలక ప్రకటన

ఈ ఏడాది జూన్ 9తో ముగియనున్న 50 సంవత్సరాల పెట్రో-డాలర్ ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరిండం లేదంటూ కీలక నిర్ణయం తీసుకుంది.

joe Biden and Saudi Arabia president Mohammed bin Salman Al Saud (photo-X)

యూనైటెడ్ స్టేట్స్‌కు సౌదీ అరేబియా షాకచ్చింది. ఈ ఏడాది జూన్ 9తో ముగియనున్న 50 సంవత్సరాల పెట్రో-డాలర్ ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరిండం లేదంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాలను చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 1974 జూన్ 8న ఈ రెండు దేశాలు రెండు ఉమ్మడి కమిషన్ల ఏర్పాటు మధ్య భద్రతా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒకటి ఆర్థిక సహకారం కాగా మరొకటి సౌదీ అరేబియా సైనిక అవసరాలు.  జీ7 సమ్మిట్‌లో జో బైడెన్ వింత ప్రవర్తన వీడియో వైరల్, అమెరికా అధినేత ప్రవర్తనపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ

అయితే ఈ మధ్య పరిణామాల్లో యూఎస్‌ డాలర్‌ కాకుండా చైనీస్ ఆర్ఎంబీ, యూరోస్, యెన్, యువాన్ వంటి ఇతర కరెన్సీలలో చమురు అమ్మకాలను అనుమతించడం ద్వారా సౌదీ అరేబియా పెట్రోడాలర్ వ్యవస్థ నుంచి దూరంగా వెళుతోంది. ఈ పరిణామంతో చమురు వాణిజ్యంలో అమెరికా డాలర్ ప్రాధాన్యం తగ్గి ఇతర కరెన్సీలు ప్రాముఖ్యతను సంతరించుకునేందుకు మార్గం సుగమం అయింది. సౌదీ అరేబియా పెట్రో డాలర్ నుంచి "పెట్రోయువాన్ వైపు అడుగులు వేస్తే అంతర్జాతీయ వాణిజ్ రంగంలో డాలర్ విలువ భారీ స్థాయిలో పడిపోయి ఇతర కరెన్సీ మారకపు విలువ భారీగా పెరిగి అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.