Starbucks New CEO: మరో గ్లోబల్ కంపెనీకి సీఈవోగా భారతీయుడు, స్టార్ బక్స్ కాఫీచైన్ బాధ్యతలు చూసుకోనున్న లక్ష్మణ్ నరసింహన్, త్వరలోనే పూర్తిస్థాయి భాధ్యతలు, లక్ష్మణ్ నరసింహన్ పూర్తి వివరాలివి!
ఈ విషయాన్ని స్టార్‌బక్స్ కార్ప్ గురువారం ప్రకటించింది. గ్లోబల్‌గా మరో ప్రముఖ కంపెనీకి సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ (Laxman Narasimhan) ఎంపిక కావడం విశేషం.
New Delhi, SEP 02: ప్రపంచ అతిపెద్ద కాఫీ చైన్ స్టార్‌బక్స్ (Starbucks ) సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ (Laxman Narasimhan) నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్టార్‌బక్స్ కార్ప్ గురువారం ప్రకటించింది. గ్లోబల్‌గా మరో ప్రముఖ కంపెనీకి సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ (Laxman Narasimhan) ఎంపిక కావడం విశేషం. ప్రస్తుతం స్టార్‌బక్స్ సీఈఓగా (CEO) ఉన్న హోవర్డ్ షుల్ట్జ్ (Howard Schultz)స్థానంలో లక్ష్మణ్ నరసింహన్‌నుఎంపిక చేసింది. అయితే రానున్న అక్టోబర్‌లో కంపెనీ చేరనున్న నరసింహన్ ఏప్రిల్1న 2023లో పూర్తి బాధ్యతలను స్వీకరిస్తారని కంపెనీ ప్రకటించింది. ఇటీవల కాలంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంస్థ ‘‘రీఇన్వెన్షన్" ప్లాన్ గురించి కొన్ని నెలలు తీవ్ర కసరత్తు చేయనున్నారు. ముఖ్యంగా బారిస్టాలకు మెరుగైన వేతనాలు, ఉద్యోగుల సంక్షేమం, కస్టమర్ అనుభవాన్ని మెరుగు పర్చడం, స్టోర్‌లను తీర్చిదిద్దడంలాంటివి ఉన్నాయి. మేనేజ్‌మెంట్ టీమ్‌తో చర్చలు, బరిస్టాగా సమగ్ర పరిశీలన ఉద్యోగులను కలవడంతోపాటు, తయారీప్లాంట్లు, కాఫీ ఫామ్‌లను సందర్శిస్తారని స్టార్‌బక్స్ తెలిపింది. అప్పటి వరకూ తాత్కాలిక సీఈఓగా ఉండాలని హోవర్డ్‌ను కోరినట్టు తెలిపింది.
ఇప్పటిదాకా డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, మ్యూసినెక్స్ కోల్డ్ సిరప్‌లను తయారు చేసే రెకిట్ సంస్థకు నరసింహన్ సీఈవోగా ఉన్నారు. అయితే ఈ పదవినుంచి వైదొలగుతున్నట్టు స్టార్‌బక్స్ ప్రకటనకు ముందు రోజు ప్రకటించారు. దీంతో FTSE-లిస్టెడ్ రెకిట్ షేర్లు 4శాతం పడిపోయాయి. నరసింహన్ సెప్టెంబరు 2019లో రెకిట్‌లో చేరిన నరసింహన్ కోవిడ్‌కాలంలో కూడా కంపెనీని విజయపథంలో నడిపి మార్కెట్ వర్గాల ప్రశంసలందుకున్నారు.
1999లో రెకిట్‌ను ఏర్పాటు చేసినప్పటి నుండి దానిలో అధికారం చేపట్టిన తొలి ప్రవాస భారతీయుడు కూడా. అలాగే గతంలో పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన నరసొంహన్ అమ్మకాలు క్షీణించిన సందర్బంలో కంపెనీని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే కాఫీ దిగ్గజం నరసింహన్‌ను తమ కీలక అధికారిగా నియమించుకుంది. ముఖ్యంగా ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 20 వేలకు పైగా స్టార్‌బక్స్ ఔట్‌లెట్స్ తెరవాలన్న టార్గెట్‌ను చేరుకునేందుకు సరియైన వ్యక్తిగా నరసింహన్‌ను ఎంపిక చేసింది.