A CDC image shows a rash on a monkeypox patient (Image Credit: Reuters)

America, August 30:అమెరికాలో మంకీపాక్స్ పాజిటివ్ కేసులు (monkeypox cases) రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 17 వేల పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్ర‌ణ‌, నివార‌ణ కేంద్రం వెల్ల‌డించింది. న్యూయార్క్‌లో అత్య‌ధికంగా 3,124 పాజిటివ్ కేసులు (monkeypox in America) న‌మోదు కాగా, కాలిఫోర్నియాలో 3,291, ఫ్లోరిడాలో 1,739 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా మంకీపాక్స్ కేసులు న‌మోదైన దేశంగా అమెరికా నిలిచింది.

అమెరికాలో ఘోరం.. ల్యాండింగ్‌ చేస్తూ ఢీ కొట్టుకున్న రెండు విమానాలు.. ఇద్దరు మృతి

నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ప్ప‌టికీ మంకీపాక్స్ పాజిటివ్ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని సీడీసీ డైరెక్ట‌ర్ రోచెల్లి వాలెన్‌స్కీ తెలిపారు. సెప్టెంబ‌ర్ నుంచి మంకీపాక్స్ వ్యాక్సిన్ ప్ర‌జ‌ల‌కు అద‌నంగా అందుబాటులోకి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. స‌రిప‌డా మంకీపాక్స్ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచలేకపోవ‌డంతో అధ్య‌క్షుడు జో బైడెన్ తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. నివార‌ణ చ‌ర్య‌ల్లోనూ బైడెన్ విఫ‌ల‌మ‌య్యార‌ని అమెరికా వాసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.