WHO Alert On 2 Indian Syrups: దగ్గుమందు వాడుతున్నారా? ఈ రెండు కంపెనీల సిరప్‌లు వాడితే డేంజర్‌లో పడ్డట్లే, విషపూరిత ఇథిలీన్ ఉన్నట్లు ప్రకటించిన డబ్లూహెచ్‌వో

వాటిలో విషపూరితమైన ఇథిలీన్‌ గ్లైకాల్‌ (diethylene glycol) లేదా ఇథిలీన్‌ ఉన్నట్లు నిర్ధారించింది. దేశంలోని నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన రెండు దగ్గు మందులు డాక్-1 మ్యాక్స్‌ సిరప్‌, అంబ్రోనల్‌ సిరప్‌లను చిన్నపిల్లలకు వినియోగించకూడదని వెల్లడించింది.

Cough Syrup (Photo-Twitter)

New Delhi, JAN 12: భారత్‌లో తయారైన రెండు దగ్గు సిరప్‌లను (cough syrups) చిన్నారులకు ఇవ్వొద్దని ఉజ్బెకిస్థాన్‌ (Uzbekistan) ప్రభుత్వానికి డబ్ల్యూహెచ్‌వో సూచించింది. వాటిలో విషపూరితమైన ఇథిలీన్‌ గ్లైకాల్‌ (diethylene glycol) లేదా ఇథిలీన్‌ ఉన్నట్లు నిర్ధారించింది. దేశంలోని నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ (Marion Biotech) తయారు చేసిన రెండు దగ్గు మందులు డాక్-1 మ్యాక్స్‌ సిరప్‌, అంబ్రోనల్‌ సిరప్‌లను చిన్నపిల్లలకు వినియోగించకూడదని వెల్లడించింది. ఉజ్బెకిస్థాన్‌లో 19 మంది పసిపిల్లల మరణాలకు వీటితో సంబంధం ఉన్నదని తెలిపింది. గతేడాది డిసెంబర్‌ నెలలో మారియన్‌ బయోటెక్‌ (Marion Biotech) తయారుచేసిన ఆ దగ్గు మందు తాగడం వల్ల 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఉజ్బెకిస్థాన్‌ ఆరోపించింది. 21 మంది చిన్నారులు ఈ సిరప్‌లను తాగగా.. వారిలో 19 మందికి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చాయని వెల్లడించింది.

Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో ముదిరిన ఆర్థిక సంక్షోభం, రూ. 220కు చేరిన కిలో ఉల్లిపాయలు, రూ.150కి చేరిన పాల ధరలు, ముందుముందు మరింత సంక్షోభంలోకి వెళ్లే అవకాశం 

ల్యాబుల్లో పరిశీలించగా వాటిలో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు తెలిందని పేర్కొన్నది. దీంతో ఉజ్బెక్‌ ప్రభుత్వం డబ్ల్యూహెచ్‌వోకి ఫిర్యాదు చేసింది. నాణ్యమైన మందులను అందిచండలో మారియన్‌ బయోటెక్‌ విఫమైందని, సిరప్‌ల తయారీలో నిర్ణీత ప్రమాణాలను పాటించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సంస్థ తయారుచేసిన రెండు సిరప్‌లు చిన్నారులకు ప్రాణాంతకమైనవని, వాటిని ఉపయోగించకూడదని డబ్ల్యూహెచ్‌తో సూచించింది.

California Floods: భారీ వరదలతో వణుకుతున్న అమెరికా, జలదిగ్భంధంలో చిక్కుకున్న కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలిస్‌, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు 

కాగా, గత అక్టోబర్‌లో భారత్‌కు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లను వాడొద్దంటూ డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. పిల్లల్లో ఈ సిరప్‌లు మూత్రపిండాలను పాడుచేస్తున్నాయని, ఇతర సమస్యలకు దారితీస్తున్నాయని తెలిపింది. ఆఫ్రికన్‌ దేశమైన గాంబియాలో (Gambia) 66 మంది పిల్లల మరణాలకు ఈ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌లకు సంబంధం ఉందని పేర్కొంది. మైడెన్ ఫార్మా కంపెనీకి చెందిన ప్రొమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్‌మలిన్ బేబీ కఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ అనే నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లలో డైథలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నాయని, ఇవి మానవులకు విషపూరితమైనవి అని తెలిపింది.