Pakistan Economic Crisis (Photo Credits: AFP)

Lahore, Jan 11: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్రరూపం (Pakistan Economic Crisis) దాల్చుతోంది. నిత్యావసరాలు ధరలు నింగిని తాకుతున్నాయి. ఒక లీటర్‌ పాల ధర (Milk Price) రూ.150కి చేరింది. 2021 జనవరిలో కిలో రూ.36గా ఉన్న ఉల్లిగడ్డ (Onion Price)ధర 2022 జనవరిలో రూ.220కి చేరింది. వీటితోపాటు ఇతర నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగాయి. ముందుముందు ఈ ధరలు Price Hike) మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

గోధుమలు, బియ్యం ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో గోధుమ పంట (Wheat Price Hike) వరదలకు పూర్తిగా దెబ్బతినడంతో గోధుమ పిండికి తీవ్ర కొరత ఏర్పడింది. కిలో గోధుమ పిండి రూ.150కి చేరింది.సబ్సిడీలో అందిస్తున్న గోధుమ పిండి కోసం వేల మంది ప్రజలు గంటల కొద్దీ క్యూల్లో వేచి చూస్తున్నారు. ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా, సింధ్‌, బలూచిస్థాన్‌ వంటి ప్రాంతాల్లో బారులు తీరి ఉన్న వరుసల్లో తొక్కిసలాటలూ, తోపులాటలూ నిత్యకృత్యమయ్యాయి. ఇక బియ్యం ధర కూడా మునుపటి ధరకు రెండింతలయ్యింది. వీటికి తోడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా 48 శాతం రెట్టింపయ్యాయి.

పాక్ హోం మంత్రి కారుపై షూ విసిరిన అగంతకుడు, అసెంబ్లీని వదిలి వెళుతుండగా ఘటన, సోషల్ మీడియాలో వీడియో వైరల్

వరదలవల్ల జరిగిన నష్టాన్ని పూడ్చటానికి పాకిస్థాన్‌ విదేశాల నుంచి భారీగా అప్పులు తీసుకొస్తున్నది. దాంతో 2011లో ఆ దేశ జీడీపీలో 52.8 శాతంగా, 2016లో 60.8 శాతంగా ఉన్న అప్పులు ప్రస్తుతం 77.8 శాతానికి పెరిగి అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు డాలర్‌తో పాకిస్థాన్‌ రూపీ మారకం విలువ కూడా రూ.177కు పతనమైంది. దీనికి ప్రధాన కారణం పలు ప్రావిన్స్‌లో బీభత్సం సృష్టించిన వర్షాలు,వరదలే.

ఇమ్రాన్‌ఖాన్‌కు అరెస్ట్ వారెంట్, ఎన్నికల కమిషన్‌పై చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసులు

ఇక పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిండుకుంటున్న విదేశీ మారక నిల్వలు పాకిస్థాన్‌ను ఆహార సంక్షోభం అంచున నిలబెట్టాయి. వర్షాలు, వరదలవల్ల పంటలు బాగా దెబ్బతినడంతో నిత్యావసరాలు ధరలు నింగిని తాకుతున్నాయి. ప్రకృతి వైపరీత్యానికి తోడు అక్కడి ప్రభుత్వం ముందుచూపు లేమి కూడా ప్రజలను కష్టాలపాలు చేస్తున్నది.

గోధుమ పిండి కోసం విలవిలలాడుతున్న పాకిస్తాన్, దాయాది దేశంలో ముదిరిన ఆర్థిక సంక్షోభం, ప్రమాదకర స్థాయిలో పడిపోతున్న విదేశీ మారక నిల్వలు

2022లో వచ్చిన వరదలతో అప్పటికే బలహీనంగా ఉన్న పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ద్రవ్యోల్బణం పైపైకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం నిత్యావసరాలు కొనుగోలు చేయడమే గగనంగా మారింది. పాక్‌ విదేశీ మారక నిల్వలు 580 కోట్ల డాలర్లకు పడిపోయి ఎనిమిదేళ్ల కనిష్ఠానికి చేరాయి. ఇవి మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ తెలిపింది.