పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు తాజాగా అరెస్ట్‌ వారెంట్ జారీ అయింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-నవాజ్) పార్టీకి ప్రయోజనం కలిగించేలా ఎన్నికల కమిషన్(ఈసీపీ), చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పక్షపాతంగా వ్యవహరించారంటూ ఇమ్రాన్, ఆ పార్టీ నేతలు పలుమార్లు బహిరంగంగానే ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ నిన్న అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఎన్నికల కమిషన్‌పై చేసిన ఆరోపణలపై తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఇమ్రాన్‌కు గతేడాది ఆగస్టు, సెప్టెంబరులో నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణలో కమిషన్ ఎదుట హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆ పార్టీ నేతలు చేసిన విజ్ఞప్తిని ఈసీపీ తిరస్కరిస్తూ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

Here's NDTV Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)