అగ్రరాజ్యం అమెరికాను భీకర వరదలు వణికిస్తున్నాయి.దేశంలోని కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలిస్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలిఫోర్నియా జనాభాలో ఏకంగా 90 శాతం మంది ప్రజలు వరద ముప్పును ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో దాదాపు 25 వేల మందిని ప్రభుత్వ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.

హాలీవుడ్‌ సినీ ప్రముఖులు నివసించే మాంటెసిటో నగరంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని అధికారులు వెల్లడించారు. బురద ముప్పు పొంచి ఉందని, ప్రజలు ఈ నగరాన్ని వెంటనే వీడాలని అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. కాలిఫోర్నియాలో 17 ప్రాంతాల్లో భీకర వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కాలిఫోర్నియాలో పలు ప్రాంతాలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

Here's Floods Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)