Thai PM Suspended: ఏకంగా ప్రధానిమంత్రిపై సస్పెన్షన్ వేటు, వయస్సు రిత్యా పదవి నుంచి దిగిపోవాలని ఆందోళనలు, థాయ్ కోర్టును ఆశ్రయించిన ప్రతిపక్షాలు, ప్రధానిగా వైదొలిగినప్పటికీ...రక్షణమంత్రిగా కొనసాగుతానన్న చాను
ప్రధాని పదవి బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. థాయిలాండ్ ప్రధానమంత్రి ప్రయూత్ చాన్ వో చాను ( Prayuth Chan-ocha ) పదవి బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాజ్యాంగ కోర్టు. పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ప్రధానిగా కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు పిటిషన్ను దాఖలు చేశాయి.
Thailand, AUG 26: ఒక దేశ ప్రధానినే కోర్టు సస్పెండ్ చేసింది. ప్రధాని పదవి బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. థాయిలాండ్ ప్రధానమంత్రి ప్రయూత్ చాన్ వో చాను ( Prayuth Chan-ocha ) పదవి బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాజ్యాంగ కోర్టు. పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ప్రధానిగా కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు పిటిషన్ను దాఖలు చేశాయి. దీనిపై విచారించిన న్యాయస్థానం గురువారం 68 ఏళ్ల ప్రధాని ప్రయూత్ చాన్-వో-చాను (Prayuth Chan-ocha ) పదవి బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి ప్రయూత్ తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగుతున్నారంటూ ప్రతిపక్షాలు పిటిషన్ విచారించిన న్యాయస్థానం.. వారి వాదనతో ఏకీభవించింది. అయితే పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారా? లేదా అనే ఆంశంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని ధర్మాసనం వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రయూత్కు సూచించింది.కానీ ప్రస్తుతం ప్రయూత్ చేతిలో ఉన్న రక్షణ శాఖను కొనసాగించాలా లేదా దానిని కూడా వదులుకోవాలా? అనే విషయంపై ఎటువంటి స్పష్టతనివ్వలేదు. తాత్కాలిక ప్రధాని ఎవరు అనేది నిర్ణయించలేదు.
కాగా.. థాయ్ లాండ్ రాజ్యాంగం ప్రకారం ఉపప్రధానమంత్రి ప్రవిత్ వాంగ్సువన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రయూత్ నాయకత్వంలోని సైనిక కూటమి 2014 మేలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మంగళవారం నాటికే ప్రయూత్ పదవీ కాలం ముగిసింది. కానీ ఆయన పదవిలో కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రయూత్ మద్దతుదారులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు.
సవరించిన రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి పదవీ కాలం 8 సంవత్సరాలని.. దీని ప్రకారం ఇది అమల్లోకి వచ్చిన 2017 ఏప్రిల్ 6 నుంచి వర్తిస్తుందని వాదిస్తున్నారు. మరోవైపు కొత్త రాజ్యాగం ప్రకారం 2019 జూన్ 9న ప్రయుత్ బాధ్యతలు చేపట్టినందున.. నాటి నుంచే పదవీ కాలం మొదలవుతుందని కొందరు వాదిస్తున్నారు. ప్రయూత్ పదవీకాలానికి సంబంధించి తిరుగుబాట్లు,హింసాత్మక నిరసనలు జరిగాయి. రాజకీయాలలో సైనిక ప్రమేయంపై వ్యతిరేకత వచ్చింది.
అయితే ప్రధాని పదవి నుంచి వైదొలిగినప్పటికీ...తాను రక్షణశాఖ మంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు చాను. దేశం కోసం తన సేవలను కొనసాగిస్తానని చెప్పారు. ప్రధానిగా వైదొలిగిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు.