Reptile Smuggling: వామ్మో...వీడెవడండీ బాబూ! ప్యాంటు జేబులో పాములు పెట్టుకొని స్మగ్లింగ్, నడుంకు బల్లులు చుట్టుకొని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్, హైటెక్ స్మగ్లింగ్ చూసి అవాక్కయిన పోలీసులు
మనం పాములు, బల్లులు అంటేనే దగ్గరకు వెళ్లడానికి భయపడతాం. కొన్ని రకాల పాములు (Snakes) వస్తున్నాయంటేనే అవి ఎక్కడ కాటేస్తాయోనన్న భయంతో దూరం పరుగెడతాం. కానీ ఓ వ్యక్తి 60 పాములు, బల్లులను ఏకంగా ప్యాంటు జేబులో వేసుకొని , నడుంకు కట్టుకొని ఎవరూ గుర్తించకుండా ఇతర ప్రాంతాలకు స్మగ్లింగ్ చేస్తున్నాడు. అయితే లాస్ ఏంజెల్స్ (Los Angeles) పోలీసులు అతని అక్రమ రవాణా గుట్టును రట్టు చేశారు.
Los Angeles, AUG 25: మనం పాములు, బల్లులు అంటేనే దగ్గరకు వెళ్లడానికి భయపడతాం. కొన్ని రకాల పాములు (Snakes) వస్తున్నాయంటేనే అవి ఎక్కడ కాటేస్తాయోనన్న భయంతో దూరం పరుగెడతాం. కానీ ఓ వ్యక్తి 60 పాములు, బల్లులను ఏకంగా ప్యాంటు జేబులో వేసుకొని , నడుంకు కట్టుకొని ఎవరూ గుర్తించకుండా ఇతర ప్రాంతాలకు స్మగ్లింగ్ చేస్తున్నాడు. అయితే లాస్ ఏంజెల్స్ (Los Angeles) పోలీసులు అతని అక్రమ రవాణా గుట్టును రట్టు చేశారు. ప్యాంటు జేబుల్లో 60 పాములు (60 Snakes), బల్లులను తరలిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. వీటి విలువ సుమారు 750,000 డాలర్లు ఉంటుంది. అయితే వీటిలో మూడు పాములు చనిపోయినట్లు లాస్ ఏంజెల్స్ పోలీసులు గుర్తించారు. దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన జోస్ మాన్యుయెల్ పెరెజ్ (Jose Manuel Perez) దీనికి సూత్రధారి. అతను ఇప్పటి వరకు మెక్సికో, హాంకాంగ్ నుంచి యునైటెడ్ స్టేట్స్ లోకి 1,700 జంతువులను తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
అయితే ఇతడు చేసిన నేరానికి దశాబ్దాలపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. యూస్ స్మగ్లర్ (US Smuggler).. యుకాటాన్ బాక్స్ తాబేళ్లు, మెక్సికన్ బాక్స్ తాబేళ్లు, పిల్ల మొసళ్లు, మెక్సికన్ పూసల బల్లులతో పాటు పలురకాల సరీసృపాలను దేశవ్యాప్తంగా విక్రయించినట్లు, వాటి విలువ సుమారు 739,000 డాలర్ల కంటే ఎక్కువ ఉంటుందని స్మగ్లర్ వద్ద లభించిన పత్రాల ద్వారా లాస్ ఏంజెల్స్ పోలీసులు గుర్తించారు.
ఈ యేడాది మార్చి నెలలో అతను మెక్సికో నుంచి పాములు, బల్లులు, ఇతర సరీసృహాలను తరలించే క్రమంలో వాటిలో కొన్నింటిని నడుముకు చుట్టుకోవటం, కొన్నింటిని అతని ప్యాంటు జేబుల్లో ఇలా మొత్తం 60 జీవులను రవాణా చేస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. అతని వద్ద రంగును మార్చే ఒక రకమైన పాము ఉంది. అయితే దాని కళ్ల నుంచి రక్తస్రావం కూడా అయింది. ఈ 60 పాములు, బల్లులు, ఇతర సరీసృపాల్లో మూడు సరీసృపాలు చనిపోయాయి.
(The above story first appeared on LatestLY on Aug 25, 2022 08:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

