Washington, Aug 25: అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ (Jill Biden) మరోసారి కరోనా బారినపడ్డారు. బుధవారం ఆమె కొవిడ్‌ టెస్టులు (Covid test) చేయించుకోగా.. పాజిటివ్‌ తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వైట్‌ హౌస్‌ తెలిపింది. ఇటీవల అధ్యక్షుడు జో బైడెన్‌కు (Joe biden) సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకున్నట్లు వైట్‌ హౌస్‌ (White house) పేర్కొంది. బైడెన్‌ డిప్యూటీ కమ్యూనికేషన్స్‌ డైరెక్టరేట్‌ కెల్సే డోనోహ్యూ మాట్లాడుతూ.. యాంటీజెన్‌ టెస్ట్‌లో కరోనా సోకిందని, ఆమె డెలావేర్‌లోనే ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. జిల్‌ బైడెన్‌కు (Jill biden) సన్నిహితంగా ఉన్నందున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ మార్గదర్శకాల మేరకు పది రోజుల పాటు ఇంట్లోనే ఉండి మాస్క్‌ ధరిస్తారని పేర్కొన్నారు.

Russia Strike On Ukraine Rail Station: ఉక్రెయిన్‌ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రష్యా బీభత్సం, రైల్వే స్టేషన్‌పై బాంబుల వర్షం, 22 మందికి పైగా మృతి, భద్రతా మండలికి ఫిర్యాదు చేసిన జెలెన్‌ స్కీ 

ఇంతకు ముందు జో బైడెన్‌ సైతం రెండుసార్లు కరోనా పాజిటివ్‌గా తేలింది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఫైజర్‌ కొవిడ్‌ టీకాను వేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో బూస్టర్‌ డోస్‌ను సైతం తీసుకున్నారు. బిడైన్‌ కంటే ముందు వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌తో పాటు పలువురు వైట్‌ హౌస్‌ అధికారులు సైతం కరోనా బారినపడ్డారు.