వరంగల్ పట్టణంలోని పద్మాక్షిరోడ్డుకు అనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ఆదివారం మొసలి కలకలం రేపింది. స్ధానికులు, జూపార్క్ రెస్క్యూ టీం కథనం ప్రకారం.. హన్మకొండలోని పద్మాక్షి నగర్లో మొసలి ప్రత్యక్షమైంది. గమనించిన స్థానికులు జూపార్క్, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సుమారు మూడు గంటల పాటు రెస్య్కూ టీం దాన్ని బంధించారు. ప్రతి ఏడాది వానాకాలంలో మొసలి రావడం తమ ప్రాంతంలో చాలా సార్లు జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఫారెస్ట్ అధికారులు మొసలి ఉంది జాగ్రత్త అంటు బోర్డును పెట్టి, చేతులు దులుపుకున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జూపార్క్ నుంచి వచ్చే నాలా ద్వారానే మొసళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు.
హన్మకొండలోని పద్మాక్షి నగర్లో మొసలి ప్రత్యక్షం pic.twitter.com/nup77qhDei
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2023