Newdelhi, June 16: అదో పెద్ద మొసలి (Crocodile). నదిలో (River) నుంచి తరచూ ఒడ్డుకు వస్తూ అక్కడే ఉండే వీధి శునకాలను ఆరగిస్తూ ఉంటుంది. దీంతో ఆ గ్రామస్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, అనంతరం పోటెత్తిన వరదలతో మొసలి గ్రామంలోకి తరుచూ రావడం మొదలుపెట్టింది. ఇది గమనించిన గ్రామస్థులు మొసలి గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే, అంత భారీ మొసలిని భద్రంగా జూ కు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. గ్రామస్థులతో పలుమార్లు సంప్రదింపులు జరిపాక ఆ మొసలిని చంపేయాల్సిందేనని, లేదంటే గ్రామస్థులకు ముప్పు తప్పదనే నిర్ణయానికి వచ్చారు.
విందు చేసుకొన్నారు..
ఒకరోజు వీధి శునకాలను తినడానికి నీటి నుంచి బయటకు వచ్చిన మొసలిని పోలీసులు కాల్చి చంపారు. అనంతరం ఆ మొసలిని గ్రామస్థులు కోసుకుని తిన్నారు. సంప్రదాయబద్ధంగా విందు (Crocodile Feast) చేసుకున్నారు. ఆస్ట్రేలియాలోని ఓ మారుమూల గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా బయటకు వచ్చింది.
వాహనదారులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఏకంగా ఎంత పెంచారంటే?