Italy, AUG 25: కరోనా మహమ్మారి విజృంభణ కాస్త తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే...మంకీ పాక్స్ వచ్చింది. దానికి ట్రీట్‌మెంట్ జరుగుతుండగానే టమాటో ఫ్లూ అంటూ మరో కొత్త వ్యాధి బయటపడింది. ఇలా కొత్త కొత్త వైరస్ లు మానవాళికి సవాల్ విసురుతున్నాయి. అయితే ఒకటి తగ్గిన తర్వాత మరొకటి తమ ప్రతాపం చూపిస్తున్నాయి. కానీ ఇటలీలో ఓ వ్యక్తికి ఒకేసారి మూడు వైరస్ లు అటాక్ అయ్యాయి. అతనికి ఒకేసారి కరోనా (Corona), మంకీపాక్స్‌తో (Monkrypox) పాటు హెచ్‌ఐవీ (HIV) నిర్ధారణ అయ్యింది. ఇటలీకి చెందిన ఓ వ్యక్తిలో ఏకకాలంలో మంకీపాక్స్, కరోనా, హెచ్‌ఐవీని ఇటాలియన్ పరిశోధకులు ఏకకాలం గుర్తించారు. సదరు వ్యక్తి ఇటీవల ఐదు రోజుల స్పెయిన్‌కు (Spain) వెళ్లి ఇటలీకి తిరిగి వచ్చాడు. అక్కడ అతను కండోమ్ లేకుండా సెక్స్ (unprotected sex) లో పాల్గొన్నట్లు తెలిపాడు.
జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. స్పెయిన్ నుంచి తిరిగి వచ్చిన తొమ్మిది రోజుల తర్వాత 36 సంవత్సరాల సదరు వ్యక్తికి జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, నడుము వాపు తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ లక్షణాలు కనిపించిన అనంతరం అతనికి మూడు రోజుల తర్వాత కరోనా సోకినట్లు గుర్తించారు. ఆ తర్వాత కొద్దిగంటల్లోనే సదరు వ్యక్తి ఎడమ చేతిపై దద్దుర్లతో పాటు బొబ్బలు కనిపించాయి.
ప్రస్తుతం సిసిలీ తూర్పుతీరంలో ఉన్న కాటానియాలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆరోగ్య పరీక్షలు చేయగా.. రిపోర్టుల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌గానూ (HIV Positive) తేలింది. సదరు వ్యక్తి 2021లో హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోగా.. నెగెటివ్‌గా వచ్చింది. అయితే స్పెయిన్ పర్యటనలో గుర్తుతెలియని వ్యక్తితో అతను కండోమ్ లేకుండా సెక్స్ చేశాడు. దాంతో అతనికి కరోనా, మంకీపాక్స్ సోకినట్లు భావిస్తున్నారు. ఇక హెచ్‌ఐవీ కూడా ఇటీవలే అతనికి సోకినట్లు తెలుస్తోంది.