Guinness World Record in Breastmilk: 2,645 లీటర్ల తల్లిపాలు దానం ఇచ్చిన మహిళ.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో చోటు.. ఏంటా సంగతి?

ప్రపంచంలో అత్యధికంగా తల్లి పాలను దానం చేసిన వ్యక్తిగా ఆమె గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్‌ సృష్టించారు.

Guinness World Record in Breastmilk (Credits: X)

Newdelhi, Nov 10: అమెరికాలోని టెక్సాస్‌ కు చెందిన మహిళ అలైస్‌ ఒగ్లిట్రీ తన మాతృ హృదయాన్ని గొప్పగా చాటుకున్నారు. ప్రపంచంలో అత్యధికంగా తల్లి పాలను (Breastmilk) దానం చేసిన వ్యక్తిగా ఆమె గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్‌ (Guinness World Record in Breastmilk) సృష్టించారు. ఈ మేరకు ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ వెబ్‌ సైట్‌ తాజాగా పేర్కొన్నది. టెక్సాస్‌ లోని ఫ్లవర్‌ మౌండ్‌ కు చెందిన 36 ఏండ్ల ఒగ్లిట్రీ జూలై 2023 కల్లా 2,645 లీటర్ల తల్లిపాలు దానం ఇచ్చారని ‘గిన్నిస్‌’ గుర్తించింది. ‘నా మనసు గొప్పదే. డబ్బులు దానం ఇవ్వలేను. కానీ తల్లి పాలు ఇవ్వొచ్చు కదా! అన్న ఆలోచన వచ్చింది’ అని ‘గిన్నిస్‌ ఆర్గనైజేషన్‌’ ఇంటర్వ్యూలో ఒగ్లిట్రీ చెప్పారు.

అలర్ట్.. హైదరాబాద్‌ లో రేపు తాగునీరు బంద్.. ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు నీళ్లు రావన్న అధికారులు.. ఎందుకంటే??

ఎవరి కోసమంటే?

నెలలు నిండకుండా పుట్టిన శిశువులను ఇన్ఫెక్షన్లు చుట్టుముడతాయి. ఇలాంటి శిశువుల కోసం దాతల నుంచి సేకరించిన తల్లి పాలను ‘హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంక్‌’ పంపిణీ చేస్తున్నది. ఇది తెలిసిన ఒగ్లిట్రీ సదరు సంస్థకు పెద్దయెత్తున తల్లిపాలు దానమిచ్చారు. తద్వారా నెలలు నిండకుండా జన్మించిన వేలాది మంది నవజాత శిశువుల కడుపు నింపుతున్నారు.

బైక్‌ పై ఆడుకుంటూ కూర్చున్న చిన్నారి ప్రమాదవశాత్తూ రోడ్డుపైకి.. అప్పుడే ట్రక్కు రావడంతో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..!



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif