Pumpkin Boat: గుమ్మడికాయ పడవపై 26 గంటల ప్రయాణం.. గిన్నిస్‌ వరల్డ్ రికార్డు.. ఏంటా సంగతి??

పడవపై తెడ్డేసుకొని ఓ పది నిమిషాలు పడవ నడపడమే ఎంతో కష్టం అయితే, గుమ్మడికాయను పడవగా చేసుకొని దానిపై ఏకంగా 26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ అమెరికన్.

Pumpkin Boat (Credits: X)

Newyork, Nov 3: పడవపై (Boat) తెడ్డేసుకొని ఓ పది నిమిషాలు పడవ నడపడమే ఎంతో కష్టం అయితే, గుమ్మడికాయను పడవగా (Pumpkin Boat) చేసుకొని దానిపై ఏకంగా  26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ అమెరికన్. అందుకే ఈ అరుదైన ఫీట్ ను సాధించిన గ్యారీ క్రిస్టెన్‌ సేన్‌ కు గిన్నిస్‌ ప్రపంచ రికార్డులో (Guinness World Record) చోటు లభించింది. ఒరెగ్యాన్‌ హ్యాపీవాయలీకి చెందిన గ్యారీ 555.2 కేజీల గుమ్మడికాయలోని గుజ్జును తీసి పడవగా మార్చాడు. దీంతో కొలంబియా నదిలో వాషింగ్టన్‌ లోని నార్త్‌ బొన్నెవిల్లి నుంచి వాంకోవర్‌ వరకు ప్రయాణించాడు. గుమ్మడికాయ పడవపై అంతకు ముందెవ్వరూ ఇంత దూరం ప్రయాణం చేయకపోవడంతో దానిని గిన్నిస్‌ రికార్డుగా నమోదు చేశారు.

శబరిమల అయ్యప్ప భక్తులకు ఉచిత బీమా.. ఈ ఏడాది వరకు మాత్రమే

ఆ గుమ్మడికాయ ఎక్కడిదంటే?

స్వతహాగా భారీ సైజులో గుమ్మడికాయలు పెంచడం గ్యారీకి అలవాటు. 2013లో అలా తయారు చేసిన గుమ్మడికాయ పడవపై ప్రయాణం చేసి స్థానిక పోటీలో బహుమతి గెల్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా 555.2 కేజీల గుమ్మడికాయను పండించి ఓ పడవగా మార్చుకొని రికార్డు సృష్టించాడు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఖరారు.. ఈ నెల 11 నుంచి సభ ప్రారంభం.. కనీసం పదిరోజుల పాటు సమావేశాలు



సంబంధిత వార్తలు