United States: అమెరికాను హడలెత్తిస్తున్న నాలుగు సంక్షోభాలు, ట్వీట్ చేసిన జో బిడెన్, పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే సవాళ్లను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటన
అమెరికా ఏకకాలంలో నాలుగు చారిత్రక సంక్షోభాలను ఎదుర్కొంటున్నదని ఇటీవల ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా (United States) కొవిడ్-19 విజృంభణ, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పు, జాతివివక్ష లాంటి నాలుగు చారిత్రక సంక్షోభాలను (four historic crises at once) ఒకేసారి ఎదుర్కొంటున్నదని బైడెన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.అయితే ఈ కాలానుగుణ సవాళ్లను ఎదుర్కోవడంపై తన బృందం హార్డ్ వర్క్ చేస్తున్నదని ఆయన (Joe Biden) చెప్పారు.
Washington DC, December 28: అమెరికా ఏకకాలంలో నాలుగు చారిత్రక సంక్షోభాలను ఎదుర్కొంటున్నదని ఇటీవల ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా (United States) కొవిడ్-19 విజృంభణ, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పు, జాతివివక్ష లాంటి నాలుగు చారిత్రక సంక్షోభాలను (four historic crises at once) ఒకేసారి ఎదుర్కొంటున్నదని బైడెన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.అయితే ఈ కాలానుగుణ సవాళ్లను ఎదుర్కోవడంపై తన బృందం హార్డ్ వర్క్ చేస్తున్నదని ఆయన (Joe Biden) చెప్పారు.
తాను పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ట్విట్టర్ ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ నాలుగు సంక్షోభాల నుంచి దేశాన్ని బయట పడేయడానికి జనవరిలో అధికార బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే తాను, తన బృందం చర్యలు తీసుకుంటామని, ఒక్కరోజును కూడా వృథా చేయబోమని చెప్పారు.
Here's Joe Biden Tweet
Here's Donald J. Trump Tweet
ఇదిలా ఉంటే జో బిడెన్ ట్వీట్ చేసిన కొన్ని గంటల తరువాత, అధ్యక్షుడు ట్రంప్ అధికారికంగా ట్రిలియన్ డాలర్ల కరోనావైరస్ ఉపశమనం మరియు ప్రభుత్వ వ్యయ బిల్లుపై సంతకం చేసినట్లు ది హిల్ నివేదించింది. కాగా దిగిపోయే ముందు పెండింగ్లో ఉన్న COVID-19 సహాయ బిల్లుపై వెంటనే సంతకం చేయమని జోబిడెన్ ట్రంప్ ని ఒత్తిడి చేసినట్లు ది హిల్ నివేదించింది.
ద్వైపాక్షిక మెజారిటీతో కాంగ్రెస్ ఆమోదించిన ఆర్థిక ఉపశమన బిల్లుపై సంతకం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించినందున లక్షలాది కుటుంబాలు తమకు ముగింపు పలకదనే విషయం ట్రంప్ కు తెలియదని జోబిడెన్ ఓ ప్రకటనలో తెలిపారు. 2.3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీలపై సంతకం చేయాలని రెండు పార్టీల సభ్యులు డోనాల్డ్ ట్రంప్‌ను కోరినట్లు ది హిల్ నివేదించింది. అంతకుముందు యుఎస్ కాంగ్రెస్‌లో ద్వైపాక్షిక మద్దతుతో ఈ బిల్లు ఆమోదించబడింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)