US Deportation India: అమెరికాలోకి అక్రమంగా భారతీయుల చొరబాటు, 161 మందిని వెనక్కి తిప్పి పంపిస్తున్న యుఎస్ఏ, అమెరికాలోని 95 జైళ్ల‌లో బందీలుగా 1739 మంది ఇండియన్లు

మెక్సికో (Mexico) స‌రిహ‌ద్దు నుంచి వారంతా అమెరికాలోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన‌ట్లు తెలుస్తోంది. తప్పుడు మార్గంలో దేశంలోకి ప్రవేశించిన కారణంగా వారిని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారిని ప్రత్యేకమైన విమానం ద్వారా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి (Punjab's Amritsar) పంపించనున్నారు.

A special chartered flight will take them to Punjab's Amritsar. (Representational)

Washington, May 18: అమెరికాలోకి అక్ర‌మంగా చొర‌బ‌డిన 161 మంది భార‌తీయుల‌ను (US Deportations India) వెన‌క్కి పంపిస్తున్నారు. మెక్సికో (Mexico) స‌రిహ‌ద్దు నుంచి వారంతా అమెరికాలోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన‌ట్లు తెలుస్తోంది. తప్పుడు మార్గంలో దేశంలోకి ప్రవేశించిన కారణంగా వారిని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారిని ప్రత్యేకమైన విమానం ద్వారా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి (Punjab's Amritsar) పంపించనున్నారు. ఇండియాలో లక్షకు చేరువలో కరోనా కేసులు, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,242 కొత్త కోవిడ్ 19 కేసులు, వణికిస్తున్న ముంబై

వీరిలో అత్యధికంగా 76 మంది హర్యానా నుంచి వెళ్లగా , తరువాతి స్ధానంలో పంజాబ్‌ నుంచి 56 మంది, గుజరాత్‌ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్‌ నుంచి 5 మంది, మహారాష్ట్ర నుంచి నలుగురు, కేరళ, తెలంగాణ, తమిళనాడు నుంచి ఇద్దరు చొప్పున వెళ్లగా ఆంధ్రప్రదేశ్‌, గోవా నుంచి ఒక్కొక్కరు వెళ్లారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వీరిలో హర్యానా నుంచి వెళ్లిన 19 యేళ్ల యువకుడు కూడా ఉన్నాడు.

అమెరికాలోని 95 జైళ్ల‌లో సుమారు 1739 మంది భార‌తీయులు బందీలుగా ఉన్న‌ట్లు నార్త్ అమెరిక‌న్ పంజాబీ అసోసియేష‌న్ (North American Punjabi Association (NAPA)ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ స‌త్నం సింగ్ చాహ‌ల్ పేర్కొన్నారు. ఇమ్మిగ్రేష‌న్ అధికారులు వారిని అరెస్టు చేసిన‌ట్లు చెప్పారు. 2018లో 611 మందిని అమెరికా దేశం నుంచి తిప్పి పంపించేయగా, 2019లో ఈ సంఖ్య రెండున్నర రెట్లు పెరిగి 1616కి చేరుకుందని తెలిపారు. 2019లో ఆ సంఖ్య రెండున్న‌ర రెట్లు ఎక్కువైంది. అమెరికాలో అక్ర‌మంగా చొర‌బ‌డిన వారిలో ఎక్కువ శాతం మంది ఉత్త‌ర భార‌త దేశానికి చెందిన‌వారున్నారు.

నార్త్‌ ఇండియాలో ముఖ్యంగా పంజాబ్‌లో ఇలా మనుషులను అక్రమంగా విదేశాలకు పంపిస్తూ ఉంటారని తెలిపారు. ఇలాంటి ఏజెంట్‌లు ఒక్కొక్కరి నుంచి 35 నుంచి 50 లక్షలు తీసుకొని వారిని ఇతర దేశాల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రోత్సహిస్తారని చహల్‌ తెలిపారు. ఈ విషయంలో పంజాబ్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎవరూ కూడా ఇలాంటి వారి చేతుల్లో మోసపోవద్దని చహల్‌ కోరారు



సంబంధిత వార్తలు