Uzbekistan Child Deaths: దగ్గు మందు తాగి 18 మంది చిన్నారులు మృతి, మేడిన్ ఇండియా మందు తీసుకోవడం వల్లే చనిపోయారని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపణ, వివరాలు కోరిన భారత్

పిల్లల మరణానికి భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌ కారణమని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపణలు గుప్పిస్తోంది.

Cough Syrup (Photo-Twitter)

New Delhi, Dec 29: ఉజ్బెకిస్తాన్‌లో సిరప్ తాగి 18 మంది చిన్నారులు మృతి (Uzbekistan Child Deaths) చెందారు. పిల్లల మరణానికి భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌ కారణమని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపణలు గుప్పిస్తోంది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 21 మంది పిల్లలలో 18 మంది ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ మారియన్‌ బయోటెక్‌ తయారు చేసిన డాక్‌-1 మాక్స్‌ దగ్గు మందు (Uzbekistan Child Deaths From India-Made Cough Syrup) తాగి పిల్లలు మృతిచెందారంటూ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

వైద్యుల సూచన లేకుండా అధిక మోతాదులో పిల్లలకు దగ్గు మందు ఇవ్వడం వల్లే ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కంపెనీ ఈ ఏడాదే ఉబ్జెకిస్తాన్‌ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 2012లో మారియన్ బయోటెక్‌ ఉజ్బెకిస్తాన్‌లో రిజిస్టర్ చేసుకుంది.సమాచారం మేరకు డోక్‌-1 మ్యాక్స్‌ సిరప్‌ ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించడం లేదు. ఈ సిరప్‌లపై నిర్వహించిన ల్యాబరేటరీ పరీక్షల్లో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ కనుగొన్నట్లు తెలిపింది.

క్యాసినోలో చెలరేగిన మంటలు, 10 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు, ఇంకా లోపల పదుల సంఖ్యలో చిక్కుకున్న స్థానికులు, మంటలను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి హెలికాప్టర్లు

ఈ ఘటనపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. ఉబ్జెకిస్తాన్‌ ప్రకటన తమ దృష్టికి వచ్చిందని.. ఘటనకు సంబంధించిన వివరాలను తమకు అందించాలని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖను భారత్‌ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీవో-నార్త్‌ జోన్‌), ఉత్తరప్రదేశ్‌ డ్రగ్స్‌ కంట్రోలింగ్‌ అండ్‌ లైసెన్సింగ్‌ అథారిటీ బృందాలు సంయుక్తంగా సదరు మందుల కంపెనీపై విచారణ ప్రారంభించాయి.

ఫిలిప్పీన్స్‌‌ను ముంచెత్తిన భారీ వరదలు, 13 మంది మృతి, 23 మంది గల్లంతు, 45 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులు

పిల్లలు ఆసుపత్రిలో చేరక ముందు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, తల్లిదండ్రులు లేదా ఫార్మసిస్ట్‌ల సలహా మేరకు అధిక మోతాదులో జలుబును తగ్గించేందుకు పిల్లలకు ఈ దగ్గు మందును అందించారు. 2.5- 5 ఎంఎల్‌ మోతాదుతో రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు 2-7 రోజుల పాటు ఈ సిరప్‌ను తీసుకున్నట్లు తేలింది. ఇది ప్రామాణిక మోతాదు కంటే ఎక్కువ’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 18 మంది పిల్లలు మరణించడంతో దేశంలోని అన్ని ఫార్మసీల నుంచి డాక్ -1 మాక్స్ టాబ్లెట్లు, సిరప్‌లపై నిషేధం విధించారు. ఈ సిరప్‌ను ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించడం లేదని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) వర్గాలు వెల్లడించాయి.

మారియన్‌ బయోటెక్‌ కంపెనీ వివరణ

ఉజ్బెకిస్తాన్‌లో పిల్లల మరణాల పట్ల చింతిస్తున్నామని మారియన్ బయోటెక్ ఫార్మా కంపెనీ పేర్కొంది. తయారీ యూనిట్‌ నుంచి దగ్గు మందు నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామని, నివేదికల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం విచారణ జరుపుతోందని, పూర్తి నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ లీగల్ హెడ్ హసన్ రజా అన్నారు.

Here's ANI Tweet

భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్‌లపై ఆరోపణలు రావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఇంతకుముందు ఆఫ్రికన్‌ దేశమైన గాంబియాలో 76 మందికి పైగా పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌లో తయారైన దగ్గు మందు సిరప్‌ కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. పిల్లల మృతిపై కంపెనీ సిరప్‌లకు సంబంధం ఉందని, వీటిని వాడవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఉబ్జెకిస్తాన్‌, గాంబియాలోనూ చిన్నారుల మరణాలకు సిరప్‌లో ప్రాణాంతక రసాయనం ఇథిలీన్ గ్లైకాల్‌ ఉండటమే కారణమని తేలింది.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి