ముంచుకొచ్చిన భారీ వర్షాలు, విలయం సృష్టిస్తున్న వరదలతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలమవుతున్నది. ఇప్పటివరకు 13 మంది మరణించగా, 23 మంది గల్లంతయ్యారు. వర్షాల వల్ల 45 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో అధికారులు వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వేడి, చల్లని గాలులు కలిసి భారీ మేఘాలను ఏర్పరచడం వల్ల కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.

Here's  Flood Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)