Pakistan Man Wants Modi as PM: ప్రధాని మోదీని మాకిస్తే మా తలరాత మార్చుకుంటాం, పాకిస్తాన్ యూట్యూబర్ సనా అంజాద్ సంచలన వ్యాఖ్యలు
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీను (Pakistan want PM Modi) మాకిస్తే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుందని తెలిపారు.
'Humein Sirf PM Modi Chahiye': దాయాది దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వేళ పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ సనా అంజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీను (Pakistan want PM Modi) మాకిస్తే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుందని తెలిపారు. మోదీని తమకిచ్చేలంటూ (Pakistan man wants Modi as PM) అల్లాని ప్రార్థిస్తున్నానంటూ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. పైగా, ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ వస్తేనే తమ దేశం బాగుపడుతుందని వ్యాఖ్యానించాడు.
ఈ సందర్భంగా షరీఫ్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. తమకు మోదీ ఒక్కడు చాలు.. నవాజ్ షరీఫ్ వద్దు.. ఇమ్రాన్ ఖాన్ వద్దు, బేనజీర్‌లు, ముషారఫ్‌లు తమకు వద్దని స్పష్టం చేశాడు. మోదీ కనుక పాకిస్థాన్‌ను పరిపాలిస్తుంటే నిత్యావసరాలన్నీ అందుబాటు ధరలకే లభ్యమయ్యేవని ఆ పౌరుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారతదేశానికి వెళ్లి తలదాచుకున్నా ఫర్వాలేదు... పాకిస్థాన్ లో మాత్రం ఉండొద్దు అనే నినాదాన్ని అతను బలపరిచాడు.
ప్రస్తుతం పాకిస్థాన్ దేశం పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో (economic crisis) కూరుకుపోయింది. విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటి..నిత్యావసర వస్తు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకున్నారు.
Here's Video
మంత్రులు విలాసవంతమైన జీవితాన్ని త్యజించాలని, తమ వద్ద ఉన్న లగ్జరీ కార్లను ప్రభుత్వానికి అప్పగించాలని, విదేశీ పర్యటనల్లో లగ్జరీ హోటళ్లలో బస్ చేయొద్దని, తమ బిల్లులు తామే చెల్లించుకోవాలని, జీతాలు తీసుకోవద్దని ఇలా అనేక ఆంక్షలు విధించారు. మరోవైపు, తమ మిత్రదేశం పాకిస్థాన్‌ను ఆదుకునేందుకు చైనా ముందుకు వచ్చింది. చైనా డెవలప్‌మెంట్ బ్యాంకు భారీగా రుణం ఇచ్చేందుకు హామీ ఇచ్చింది.