New Delhi, Feb 24: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్(ఎంసీడీ)లోని స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ కార్పోరేటర్ల మధ్య మూడు రోజుల నుంచి Delhi Civic Centreలో కొట్లాట కొనసాగుతూనే ఉంది. ఎంసీడీ ఎన్నికల పోలింగ్ పూర్తయినప్పటి నుంచి రెండు పార్టీల మధ్య గొడవలు (AAP and BJP Councillors jostle) మొదలయ్యాయి. ఈ క్రమంలో ఎంసీడీ సభలో ఆప్, బీజేపీ నేతలు టేబుల్స్‌పైకి ఎక్కి నినాదాలు చేశారు. దీంతో, ఆ ప్రాంతంలో రసాభాస చోటుచేసుకుంది.
ఆప్ మెజారిటీతో స్థానాలు గెలుచుకోవడంతో ఎంసీడీ పీఠంపై అడ్డదారిలో పట్టు నిలుపుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పించి మేయర్ పీఠం దక్కించుకోవాలని చూసింది.బీజేపీ ప్రయత్నాన్ని పసిగట్టిన ఆప్ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో గొడవ మొదలయ్యింది. దాంతో మేయర్ ఎన్నిక కోసం ఎంసీడీ మూడు సార్లు సమావేశమైనా రెండు పార్టీల సభ్యుల నడుమ కొట్లాటతో ఎన్నిక వాయిదాపడుతూ వచ్చింది. ఆఖరితో సుప్రీంకోర్టు జోక్యంతో నాలుగోసారి (గత బుధవారం) ఎంసీడీ సమావేశమై మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తిచేసింది. అయితే, ఆరుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ ఎన్నిక విషయంలో మళ్లీ వివాదం రాజుకుంది.
కాగా ఎంసీడీలో ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎంపిక కోసం శుక్రవారం ఓటింగ్ జరిగింది. ఈ సందర్భంగా తామే గెలుపొందినట్టు ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ప్రకటించారు. తమ పార్టీకి మొత్తం 138 ఓట్లు వచ్చాయని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ కౌన్సిలర్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు ఆయన తెలిపారు. చెందిన ఐదుగురు సభ్యులు ఆప్ అభ్యర్థులకు ఓటేశారని ఆయన చెప్పుకొచ్చారు.
Here's Ruckus Video
#WATCH | Ruckus breaks out at Delhi Civic Centre once again as AAP and BJP Councillors jostle, manhandle and rain blows on each other. This is the third day of commotions in the House. pic.twitter.com/Sfjz0osOSk
— ANI (@ANI) February 24, 2023
ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ 134 స్థానాలు గెలిచింది. అయితే ఇవాళ ఒక ఆప్ సభ్యుడు బీజేపీలో చేరాడు. దాంతో ఆప్ బలం 133కు తగ్గింది. అయినప్పటికీ శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఆప్‌కు 138 మంది సభ్యుల ఓట్లు పడటంతో బీజేపీ సభ్యులు క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే బీజేపీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.ఆప్ తామే గెలిచినట్లు తప్పుడు ప్రకటన చేసిందని బీజేపీ ఎదురుదాడికి దిగింది.ఎన్నికల అధికారులు మొత్తం ఆరుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీకి ముగ్గురు ఆప్ సభ్యులు, ముగ్గురు బీజేపీ సభ్యులు ఎన్నికయ్యారని తెలిపినట్టు బీజేపీ చెబుతోంది.
ఈ నేపథ్యంలో సభలో కొందరు కౌన్సిలర్లు జై శ్రీరామ్, జై మోదీ అంటూ నినాదాలు చేయగా.. ఆప్ కౌన్సిలర్లు ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్, కేజ్రీవాల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఎన్నికల్లో ఆప్ తరఫున అమీల్ మాలిక్, రమీందర్ కౌర్, మోహిని జీన్వాల్, సారిక చౌదరిలను నామినేట్ చేసింది. మరోవైపు, బీజేపీ కమల్‌జీత్ సెహ్రావత్, పంకజ్ లూథ్రాలను రంగంలోకి దింపింది.
ఆమ్ ఆద్మీ-బీజేపీ నేతల తుక్కు తుక్కు ఫైటింగ్, కుప్పకూలిన కౌన్సిలర్, మూడో రోజు కూడా సభలో గందరగోళం
కాగా, బీజేపీలో చేరిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ గజేందర్ సింగ్ దారాల్ కూడా పోటీలో ఉన్నారు. అయితే, స్టండింగ్ కమిటీకి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది నిధులను ఎలా ఉపయోగించాలి, పలు ప్రాజెక్ట్‌లపై నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది.ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు చెల్లదంటూ మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రకటించడంతో సభలో బాహాబాహీ చోటుచేసుకుంది.
బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఆప్, బీజేపీ సభ్యులు ఒకరినొకరు కొట్టకున్నారు. చేతికి ఏది దొరికితే అది ఒకరిపై ఒకరు విసిరేసుకున్నారు.
మహిళా సభ్యులు కూడా జుట్లు జట్లు పట్టి కొట్టుకున్నారు. సభలో తన్నుకోవడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. కౌన్సిలర్లను అడ్డుకున్నారు. ఘర్షణలో ఒక కౌన్సిలర్ కుప్పకూలిపోయాడు.ఢిల్లీ సివిక్ సెంటర్‌లో కుప్పకూలిన ఆప్ కౌన్సిలర్ అశోక్ కుమార్ మాను తన పార్టీకి చెందిన ఇతర కౌన్సిలర్‌లతో కలిసి మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు.మహిళలు, మేయర్‌పై కూడా దాడి చేసేంత సిగ్గులేని వారు.. బీజేపీ గూండాలు ఇలా చేశారు’ అని మండిపడ్డారు.