US Capitol Violence Row: డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ మీద షాకులు, తాజాగా యూట్యాబ్ ఛానల్‌పై వారం పాటు వేటు, హింసను ప్రేరేపించేలా కంటెంట్, ఇప్పటికే ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విచ్, రెడ్డిట్ అకౌంట్లపై నిషేధం
ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై వేటు వేస్తున్న సంస్థల్లో తాజాగా యూ ట్యూబ్ (YouTube Bars Donald Trump From Uploading Videos) కూడా చేరింది. ట్రంప్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను హింసను (US Capitol Riot) రెచ్చగొడుతున్నట్టుగా ఉందని ఆరోపణల నేపథ్యంలో యూట్యూబ్ కొరడా ఝళిపించింది. ట్రంప్ ఛానెల్‌ను (Donald Trump YouTube Channel) కనీసం ఒక వారం సస్పెండ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.
Washington, January 13: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై సోషల్ మీడియా సంస్థలు, టెక్ కంపెనీలు తమ ప్రతాపాన్ని కొనసాగిస్తున్నాయి. ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై వేటు వేస్తున్న సంస్థల్లో తాజాగా యూ ట్యూబ్ (YouTube Bars Donald Trump From Uploading Videos) కూడా చేరింది. ట్రంప్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను హింసను (US Capitol Riot) రెచ్చగొడుతున్నట్టుగా ఉందని ఆరోపణల నేపథ్యంలో యూట్యూబ్ కొరడా ఝళిపించింది. ట్రంప్ ఛానెల్‌ను (Donald Trump YouTube Channel) కనీసం ఒక వారం సస్పెండ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.
అయితే ఈ నిషేధాన్ని మరింత కాలం పాటు కొనసాగించేందుకు యూట్యూబ్ ఈ రకమైన ప్రకటన చేసి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్‌కు చెందిన అకౌంట్లపై ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విచ్, రెడ్డిట్ ఇప్పటికే వేటు వేశాయి. యూట్యూబ్ కూడా ఇదే నిర్ణయాన్ని అమలు చేయాలంటూ హాలీవుడ్ స్టార్లు, ఇతరు ప్రముఖుల నుంచి ఇటీవల కాలంలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ కూడా మిగతా సామాజిక మాధ్యమాల నిర్ణయాన్నే అమలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో హింస (US Capitol Violence) చెలరేగే అవకాశం ఉండటంతో ట్రంప్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఛానల్‌లోని కామెంట్ సెక్షన్ కూడా డిసేబుల్ చేసింది.
ఈ వీడియోపై వ్యాఖ్యలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు కూడా తెలిపింది. ట్రంప్ ఛానల్ తాజా కంటెంట్‌ను జాగ్రత్తగా సమీక్షించిన తరువాత, హింసకు ప్రేరేపిస్తుందన్న ఆందోళనల దృష్ట్యా , తాజాగా అప్‌లోడ్ చేసిన క్రొత్త కంటెంట్‌ను తొలగించామని, తమ విధానాలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నామని యూట్యూబ్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ నుంచి ట్రంప్ ఛానల్‌ను తొలగించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక సంఘాలు మంగళవారం డిమాండ్ చేశాయి. లేదంటే వాణిజ్య ప్రకటనలను నిలిపివేసేలా ప్రచారం చేపడతామని హెచ్చరించాయి.
స్టాప్ హేట్ ఫర్ ప్రాఫిట్ ఉద్యమ సంస్థ ఈ వార్నింగ్ ఇచ్చింది.
కాగా క్యాపిటల్ హిల్ దాడి ఘటన తర్వాత సోషల్ మీడియా సంస్థలన్నీ ట్రంప్‌ను బ్లాక్ చేస్తున్నాయి. కాగా క్యాపిటల్ హిల్ దాడి ఘటన తర్వాత ట్రంప్‌కు చెందిన 70వేలమంది ట్విటర్ ఖాతాలను నిలిపివేసింది. ట్రంప్ ఛానల్‌కు సుమారు 2.77 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. స్నాప్‌చాట్, ట్విచ్ లాంటి సోషల్ మీడియాను కూడా ట్రంప్‌కు దూరం చేశారు. తమ ఫ్లాట్‌ఫాంను ట్రంప్ దుర్వినియోగం చేశారని, దానితో హింస రెచ్చగొట్టేలా చూశారని ఎఫ్‌బీ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.