Galla Jayadev (PIC @ X)

Vijayawada, JAN 28: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌(TDP MP Galla Jayadev ) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఒక ఒరలో రెండు కత్తులుండవన్నట్లు అటు రాజకీయం, ఇటు వ్యాపారం( Business ) చేయలేకపోతున్నానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో(Politics) ఉంటే వివాదాలు వస్తున్నాయని, రెండు చోట్ల ఉండలేనందునే రాజకీయం వదిలేశానని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నానని, మళ్లీ పోటీ చేసినా గెలుస్తానని ధీమాను వ్యక్తం చేశారు. పార్లమెంటు(Parliament) లో మౌనంగా కూర్చోవడం నా వల్ల కాదు. నా పని పూర్తిగా నిర్వర్తించ లేకపోతున్నాననే భావన ఉందని అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బందులని మౌనంగా ఉండలేనని అన్నారు.

 

రాష్ట్రంలోని వివిధ ప్రధాన సమస్యలపై పార్లమెంట్‌లో గట్టిగా ప్రశ్నించినందుకు ఈడీ, సీబీఐ నా ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నాయని, వివిధ కేసుల్లో ఈడీ రెండుసార్లు పిలిచి విచారించిందని వెల్లడించారు. గల్లా జయదేవ్‌ తల్లి గల్లా అరుణాకుమారి ఉమ్మడి రాష్ట్రంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు.