Newdelhi, Sep 7: ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన ఆటల్లో క్రికెట్ ది అగ్రస్థానం. అలాంటి ఆటను యూరప్ (Europe) లోని ఓ నగరం మాత్రం నిషేధించింది. ఒకవేళ ఎవరైనా ఈ కట్టుబాటును ఉల్లంఘించి క్రికెట్ బ్యాటు, బంతితో కంటపడితే.. 100 యూరోలు (భారతీయ కరెన్సీలో రూ.9 వేలు) జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఇటలీలోని మొన్ ఫాల్కొనే (Monfalcone) అనే నగరంలోనే ఈ ఆంక్షలు విధించారు.
నిషేధం ఎందుకంటే?
క్రికెట్ పిచ్ (Cricket Pitch) తయారీకి పెద్దమొత్తంలో డబ్బులు కావాలి. పైగా మ్యాచ్ ల నిర్వహణకు ఓ చిన్నపాటి స్టేడియం (Mini Stadium) అయినా అవసరం. కానీ, పిచ్ తయారీకిమొన్ ఫాల్కొనే మున్సిపల్ ఖజానాలో డబ్బులు లేవు. స్టేడియం నిర్మాణానికి అవసరమైన భారీ స్థలం కూడా మొన్ ఫాల్కొనేలో లేదు. అందుకనే ఈ ఆటపై ఇక్కడ నిషేధం విధించారు.