భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ (Vinesh Phogat ) కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వినేశ్‌ ఫోగట్‌ తాజాగా కీలక ప్రకటన చేశారు. రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా (resigns from her post in Indian Railways) చేసినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు . వినేశ్‌ ఫోగట్ (Vinesh Phogat)‌, బజరంగ్‌ పునియా (Bajrang Punia) కాంగ్రెస్‌ పార్టీలోకి చేరుతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. విభాగానికి సరిపోయేంత బ‌రువు ఉండ‌డం అనేది అథ్లెట్ల బాధ్య‌త, వినేశ్ ఫోగాట్ అప్పీల్‌పై 24 పేజీల తీర్పును వెల్లడించిన కాస్

త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరికీ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెజ్లర్లు ఇవాళ హస్తం పార్టీలో చేరుతున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు సదరు కథనాలు వెల్లడించింది.

Here's Her Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)