దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కర్వ్ ఐసీఈ మోడల్‌ను విపణిలోకి తీసుకువచ్చింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కర్వ్ మోడల్ కార్‌ను రూ.9.99 లక్షల ప్రారంభ ధరకు మార్కెట్లో విడుదల చేసింది. ఈ శ్రేణిలో టాప్ మోడల్ ధర రూ.17.69లక్షల వరకు ఉంటుంది. అక్టోబర్ 31 వరకు బుకింగ్ సదుపాయం ఉంది. బుకింగ్ డేట్ అయిపోయిన తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉందని టాటా కంపెనీ తెలిపింది.
టాటా కర్వ్ స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అచీవ్ అనే నాలుగు ట్రిమ్ స్థాయిల్లో అందుబాటులో ఉంటుంది. కర్వ్‌లో పలు సబ్ వేరియంట్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. టాటా కర్వ్ యూఎస్‌వీ సెగ్మెంట్‌లో 11వ వాహనం. కర్వ్ ఐసీఈ, ఎలక్ట్రికల్ వెర్షన్ రెండూ టాటా అట్లాస్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. వాటి డిజైన్స్ సైతం ఒకేలా ఉంటుంది.
ఫీచర్ల విషయానికి వస్తే కర్వ్ ఇంజిన్‌ను కూల్ చేసేందుకు వెంట్‌లతో కూడిన ఫ్రంట్ గిల్‌ను ఏర్పాటు చేసింది.ఎయిర్ డ్యామ్ విభిన్నంగా రూపొందించింది.18 అంగులాల అల్లాయ్ వీల్స్ సైతం కర్వ్ ఈవీ కంటే భిన్నంగా కనిపిస్తాయి.టాటా కర్వ్‌లో గెస్చర్ కంట్రోల్స్‌తో కూడిన పవర్డ్ టెయిల్ గేట్ ఉంటుంది. టాటా కర్వ్ స్టాండర్డ్ డివైజ్‌ల జాబితాలో 4 స్పోక్ వీల్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సెటప్, 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 9 స్పీకర్స్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్ సైతం ఉన్నాయి.
ధర విషయానికి వస్తే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో టాటా కర్వ్ బేస్ మోడల్ స్మార్ట్ వేరియంట్ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించింది. ప్యూర్ ప్లస్ వేరియంట్ ధర రూ.10.99 లక్షలు, క్రియేటివ్ వేరియంట్ రూ.12.19 లక్షలు, క్రియేటివ్ ఎస్ వేరియంట్ రూ.12.69 లక్షలు, క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్ రూ.13.69 లక్షలుగా నిర్ణయించింది.
1.2 లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్, టాటా కర్వ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన క్రియేటివ్ ఎస్ వేరియంట్ ధర రూ.13.99 లక్షలుగా నిర్ణయించింది. క్రియేటివ్ ఎస్ వేరియంట్ ధర రూ.14.99 లక్షలు, అన్‌కంప్లీటెడ్ ఎస్ ధర రూ.15.99లక్షలుగా ఉండనున్నది. అయితే, ఇవన్నీ ప్రారంభ ధరలు కాగా.. అక్టోబర్ 31 వరకు కొనుగోలు చేసిన వరకు మాత్రమే ఈ ప్రయోజనం పొందనున్నారు.