75 ఏళ్ల వృద్ధుడైన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కదిలే రైలు- ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్, అక్కడి ప్రయాణికుల సాయంతో అతన్ని రక్షించారు ఈ ఘటన తిరుచ్చి రైల్వే జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కదులుతున్న పల్లవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా, తిరుచ్చిలోని కారుమండపానికి చెందిన రిటైర్డ్ రైల్వే అధికారి జయచంద్రన్ రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య ఉన్న సన్నని గ్యాప్‌లోకి జారిపోయాడు. వీడియో ఇదిగో, సెల్ఫీ తీసుకుంటూ వంతెన మీద నుంచి గంగా నదిలో పడిపోయిన యువతి, అదృష్టవశాత్తూ అక్కడే సిబ్బంది ఉండటంతో ప్రాణాలతో బయటకు
ప్లాట్‌ఫారమ్ వన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ రామచంద్రన్ అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రైలు గార్డును అప్రమత్తం చేశాడు. వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికుల సహాయంతో, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రైల్వే ట్రాక్‌పై నుంచి వ్యక్తిని బయటకు తీశాడు. జయచంద్రన్ కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిమిత్తం జంక్షన్‌లోని అత్యవసర సంరక్షణ కేంద్రానికి తరలించారు.
Here's Video
Watch | A 75-year-old retired railway employee, stuck between a platform and a moving train, was rescued by RPF constable, fellow passengers at #Trichy railway junction
The incident happened when the man attempted to board Chennai-bound Pallavan Superfast Express. He sustained… pic.twitter.com/DdHKyUzSDK
— The Times Of India (@timesofindia) August 27, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)