Hyderabad, SEP 07: జైలర్ నటుడు వినాయకన్‌ను (Vinayakan arrested) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో సీఐఎస్‌ఎఫ్ (Central Industrial Security Force) కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్.. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన వినాయకన్ తానే తప్పూ చేయలేదంటున్నాడు.
Here's Video
Malayalam Actor Vinayakan Detained at RGIA for Misbehaving & Altercation with Staff
Malayalam actor Vinayakan, known for his roles as a villain in Films , was detained by the Rajiv Gandhi International Airport (RGIA) police today for allegedly misbehaving with gate staff while… pic.twitter.com/tmNUcvhFwc
— Sudhakar Udumula (@sudhakarudumula) September 7, 2024
ఎయిర్‌పోర్టు (Hyderabad airport) అధికారులే తనను గదిలోకి తీసుకెళ్లి వేధించారంటున్నాడు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చెక్ చేసుకోమని చెప్తున్నాడు. అసలు తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని మీడియాతో వాపోయాడు.
కాగా మలయాళ నటుడు వినాయకన్.. రజనీకాంత్ జైలర్ సినిమాలో వర్మ పాత్రతో మరింత పాపులర్ అయ్యాడు. గతేడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తన వల్ల జైలుపాలయ్యాడు.