Green Drive: మారుతీ సుజుకీ సంచలన నిర్ణయం, వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఉండవ్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీపై దృష్టిసారించిన మారుతీ, ఎకో ఫ్రెండ్లీకి పెద్దపీట అంటూ ప్రకటన

వ‌చ్చే 7 ఏళ్ల నుంచి 10ఏళ్లలో పూర్తిగా పెట్రోల్ ‘pure petrol’ వినియోగ కార్ల త‌యారీని ఆపేస్తామని ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుత ప్లాన్ ప్ర‌కారం.. వ‌చ్చే పదేళ్లలో హైబ్రీడ్‌, ఫ్లెక్స్ ఫ్యూయ‌ల్‌, బ‌యో ఫ్యూయ‌ల్‌, ప్యూర్ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ తయారుచేయాలని నిర్ణయిచింది.

New Delhi, July 04: దేశవ్యాప్తంగా ఇందన ధరలు (Fuel prices) పెరిగిపోతున్నాయి. పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) ధరలు ఎంతమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ వాహనాలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. అందులోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు (electric vehicles) డిమాండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిసారించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలపై (EV) ప్రత్యేక రాయితీలు ఇస్తామని ఆఫర్ చేయడంతో కార్ల కంపెనీలు ఈవీ కార్లను తయారుచేసేందుకు ముందుకు వస్తున్నాయి. ప్యూర్ పెట్రోల్ (Pure Petrol)వాహనాల కారణంగా కర్బన ఉద్గారాలతో పర్యావరణం దెబ్బతింటోంది. క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత ప‌ర్స‌న‌ల్ మొబిలిటీపై ఆసక్తి పెరిగింది. విదేశీయుల‌ే కాదు.. మన భారతీయులు కూడా ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, స్కూట‌ర్ల‌పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దేశీయంగా విద్యుత్ వాహ‌నాల మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు చ‌ర్య‌లు చేపడుతున్నారు.

Ambassador Comeback: కొత్తరూపంలో అంబాసిడర్ కారు, రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని హిందుస్థాన్ కంపెనీ ప్రకటన, ట్రెండ్ కు తగ్గట్లు ఎలక్ట్రానిక్ అంబాసిడర్ తయారీ యోచనలో కంపెనీ 

దేశంలోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకీ (Maruti) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ‌చ్చే 7 ఏళ్ల నుంచి 10ఏళ్లలో పూర్తిగా పెట్రోల్ ‘pure petrol’ వినియోగ కార్ల త‌యారీని ఆపేస్తామని ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుత ప్లాన్ ప్ర‌కారం.. వ‌చ్చే పదేళ్లలో హైబ్రీడ్‌, ఫ్లెక్స్ ఫ్యూయ‌ల్‌, బ‌యో ఫ్యూయ‌ల్‌, ప్యూర్ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ తయారుచేయాలని నిర్ణయిచింది. BS-6 క‌ర్బ‌న ఉద్గారాల ప్ర‌మాణాలు అమ‌ల్లోకి తేవ‌డంతో 2020 ఏప్రిల్ నుంచే డీజిల్ కార్ల త‌యారీని నిలిపేసింది.

Tata Motors: టాటా మోటర్స్ నుంచి మరో అద్భుతమైన ఎలక్ట్రిక్‌ కారు, సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న టీజర్ 

వ‌చ్చే మూడేళ్లలోపు.. 2025 నాటికి పూర్తి స్థాయిలో అన్ని ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్‌ను లాంచ్ చేయలేమని మారుతి సుజుకి స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ పైన మాత్రమే వర్క్ మొదలుపెట్టామని మారుతి సుజుకి ఇండియా చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ సీవీ రామ‌న్ చెప్పారు. వ‌చ్చే దశాబ్దకాలంలో అన్ని వాహ‌నాల‌ను ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ వాహనాలుగా క‌న్వ‌ర్ట్ చేస్తామన్నారు. ఆపై పూర్తి పెట్రోల్ వినియోగ వాహనాలు ఉండ‌వని తెలిపారు. అంటే.. అవి విద్యుత్ వాహ‌నాలైనా లేదా సీఎన్జీ లేదా బ‌యో ఫ్యూయ‌ల్ వాహ‌నాలైనా ఉండొచ్చునని సీవీ రామ‌న్ పేర్కొన్నారు.