Naresh Goyal Arrest: జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్ట్.. కెనరా బ్యాంకును మోసగించినందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అదుపులోకి
కెనరా బ్యాంకుకు చెందిన రూ.538 కోట్ల నిధులు స్వలాభానికి పక్కదారి పట్టించినట్టు గోయల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Newdelhi, Sep 2: జెట్ ఎయిర్‌వేస్ (Jet Airways) వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (Naresh Goyal)ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) తాజాగా అరెస్ట్ చేసింది. కెనరా బ్యాంకుకు చెందిన రూ.538 కోట్ల నిధులు స్వలాభానికి పక్కదారి పట్టించినట్టు గోయల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబైలోని ఈడీ ఆఫీసులో గోయల్‌ను సుదీర్ఘంగా విచారించిన అధికారులు చివరకు ఆయనను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నారు. శనివారం అధికారులు ఆయనను నగరంలోని పీఎమ్ఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గోయల్ కస్టోడియల్ రిమాండ్‌ను ఈడీ కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆరోపణ ఇది..
తాము రుణంగా ఇచ్చిన రూ.538 కోట్ల నిధులను దారిమళ్లించారంటూ గతంలో కెనరా బ్యాంకు గోయల్, ఆయన భార్య అనిత, ఇతర కంపెనీ ఉన్నతాధికారులపై ఫ్రాడ్ కేసు దాఖలు చేసింది.