Newdelhi, Sept 2: వివాహేతర సంబంధం వల్ల కలిగిన సంతానానికీ వారి తల్లిదండ్రులు, పూర్వీకుల ఆస్తిలో (ancestral property) వాటా పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు (Supreme Court) వెల్లడించింది. పురుషులతో పాటు మహిళలకు కూడా ఈ హక్కులు వర్తిస్తాయని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. చెల్లుబాటు కానటువంటి, రద్దయ్యే అవకాశం ఉన్న వివాహాల ద్వారా కలిగిన సంతానం కూడా చట్టబద్ధ వారసులేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న ఓ అభ్యర్థనపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. హిందూ చట్టాల ప్రకారం వివాహేతర సంబంధాల్లోని సంతానానికీ తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తికి చట్టబద్ధమైన వారసులని స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం కింద హిందూ అవిభాజ్య కుటుంబపు పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందని వివరించింది. అక్రమ సంతానానికి ఈ హక్కు ఉండదంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుత ధర్మాసనం విభేదించింది.

Aditya L1 Launch Today: చంద్రయాన్‌-3 సూపర్ సక్సెస్ తర్వాత ఆదిత్య-ఎల్‌1 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఉ.11.50 గంటలకు ప్రయోగం.. సూర్యుడిపై అధ్యయనం చేయడమే లక్ష్యం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)