James Morosini: అమ్మాయితో ప్రముఖ హీరో ఆన్‌లైన్‌ డేటింగ్, షాకింగ్ ఏంటంటే ఆ హీరో తండ్రే అమ్మాయిగా మారాడు, పూర్తి కథ ఓ సారి చదివేద్దామా..

ఆయన (James Morosini) గతకొద్ది కాలం నుంచి ఫేస్‌బుక్‌లో ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు.

James Morosini (Photo-James Morosini/Instagram)

హాలీవుడ్‌ నటుడు, దర్శకుడు జేమ్స్‌ మోరొసినికి కొన్ని ఆసక్తికర విషయాలను బయటకు వెల్లడించాడు. ఆయన (James Morosini) గతకొద్ది కాలం నుంచి ఫేస్‌బుక్‌లో ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. అయితే ఆ తర్వాత తను (Actor James Morosini) ఛాట్ చేసింది తన తండ్రితో అని తెలుసుకుని ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఈ వివరాలను ఆయన మీడియాతో పంచుకున్నాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆన్‌లైన్‌ వేదికగా 31 ఏళ్ల జేమ్స్‌ మోరొసినికి, బెక్కా అనే అమ్మాయికి పరిచయమైంది.

ఇద్దరి అభిరుచులు, అలవాట్లు కలవడంతో వారి మధ్య స్నేహం చిగురించింది. స్నేహం కాస్తా ఆన్‌లైన్‌ డేటింగ్‌కు (He Was Dating Online) దారితీసింది. ఇలా కొన్ని రోజులు ఆ అమ్మాయితో జేమ్స్‌ మోరొసిని డేటింగ్‌, చాటింగ్‌ చేస్తూనే ఉన్నాడు. ఈక్రమంలోనే తనకు సంబంధించిన చాలా విషయాలు ఆ అమ్మాయి చెప్పేస్తుండటంతో ఈ ఛాటింగ్ వీరుడికి అనుమానం వచ్చింది. దీంతో మరింత లోతుగా ఆ యువతి బెక్కా వివరాలు తెలుసుకుని షాకయ్యాడు. అతడు ఆన్‌లైన్‌లో ఇన్నిరోజులూ డేటింగ్ చేస్తున్నది తన తండ్రితో అని తెలిసి బిక్కచచ్చిపోయాడు.

హీరో అజిత్ కిస్సింగ్ ఫోటో వైరల్, భార్య షాలినితో పబ్‌లో డిన్నర్ డేటింగ్ చేసిన సౌత్ ఇండియా సూపర్ స్టార్, ఫిదా అవుతున్న ఫ్యాన్స్

అయితే, తన తండ్రి ఫేక్‌ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌తో అలా ఎందుకు చేశాడో తెలుసుకుని కాస్తా కుదుటపడ్డాడు. అమ్మాయిల పట్ల తన ప్రవర్తన ఎలా ఉంది. ఇతరులతో ఆన్‌లైన్‌ స్నేహాలు గట్రా చేసే క్రమంలో ఓవర్‌ చేస్తున్నాడా? అని తెలుసుకునేందుకే ఆయన అలా చేశాడని తెలిసింది. దీంతో మనోడు మంచి బాలుడు అనిపించుకోవడంతో ఈ వ్యవహారానికి ముగింపు పలికినట్లయింది.



సంబంధిత వార్తలు