Trisha Emotional Post: నా కొడుకు చనిపోయాడు! నటి త్రిష ఎమోషనల్ పోస్ట్, ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న పోస్ట్ ఇదుగో..
నేను, నా కుటుంబం ఇప్పుడు షాక్ లో బాధలో ఉన్నాం. మేము కోలుకోడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉండను అని తెలిపింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
Chennai, DEC 25: ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష (Actress Trisha) మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చినా 96, పొన్నియిన్ సెల్వన్ సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి దూసుకెళ్తుంది. మళ్ళీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్న త్రిష అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేస్తుంది. తాజాగా నేడు త్రిష ఓ విషాదకరమైన పోస్ట్ చేసింది. త్రిష తన సోషల్ మీడియాలో.. నా కొడుకు జొర్రో ఇవాళ ఉదయం క్రిస్మస్ రోజు మరణించాడు. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు జొర్రో నాకు ఎంత ముఖ్యమో కూడా తెలుసు. నేను, నా కుటుంబం ఇప్పుడు షాక్ లో బాధలో ఉన్నాం. మేము కోలుకోడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉండను అని తెలిపింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ఇక్కడ జొర్రో అంటే త్రిష పెంపుడు కుక్క (Trisha Pet Dog). మరో పోస్ట్ లో.. తన కుక్క ఫొటోలతో పాటు తాజాగా తన కుక్కను పూడ్చి పూలదండలు వేసిన స్థలాన్ని కూడా ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ కుక్క 2012 లో పుట్టి 2024 లో చనిపోయిందని కూడా తెలిపింది. ఈ పోస్టులతో తన పెంపుడు కుక్క అంటే త్రిషకు ఎంతిష్టమో తెలుస్తుంది. ఇక పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు త్రిషకు ఈ సమయంలో జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Trisha Krishnan Shares Emotional Post
ఇక త్రిష ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర, అజిత్ విడమూయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, సూర్య, కమల్ హాసన్ థగ్ లైఫ్.. ఇలా ఆల్మోస్ట్ అరడజను సినిమాలతో బిజీగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో 40 ఏళ్ళ వయసులో కూడా త్రిష స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. ఇన్నేళ్లు వచ్చినా త్రిష కూడా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం.