దేవర రిలీజ్ టైంలో క్యాన్సర్ బారిన పడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ తిరుపతి కి చెందిన కౌశిక్ తాజాగా ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కాగా తన చివరి కోరిక దేవర సినిమా చూసి చనిపోవడం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా చేసిన విషయం విదితమే.దీంతో విషయం ఎన్టీఆర్ కి తెలియడంతో కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడటమే కాకుండా తన వైద్యానికి అయ్యే ఖర్చులని చూసుకుంటానని ఎన్టీఆర్ హామీ ఇవ్వడం జరిగింది.
ఇప్పడు ఇచ్చిన హామీ ప్రకారం ఎన్టీఆర్ కౌశిక్ హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టడం జరిగింది. కానీ ఈ విషయం తెలుసుకోకుండా నిన్నటి నుంచి సోషల్ మీడియా, కొన్ని చానల్స్ లో ఎన్టీఆర్ ని నిందిస్తూ రకరకాల వార్తలు, పోస్టులు చెయ్యడం జరిగింది. తన టీమ్ తో అభిమాని యోగక్షేమాలు తెలుసుకొని దగ్గరుండి మరి ఎన్టీఆర్ డిశ్చార్జ్ చేయించాడు.
రీసెంట్ గా కౌశిక్ తల్లి మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ నుంచి ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదు అని చెప్పింది. కానీ ఈ విషయంలో మిస్ కమ్యూనికేషన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
Kaushik Mother Comments
జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. ఓ అభిమాని తల్లి ఆవేదన...
👉క్యాన్సర్తో బాధపడుతూ చెన్నై అపోలోలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్.
👉'దేవర' సినిమా చూసి చనిపోవాలని, తన చివరి కోరిక అదే అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టు.
👉అబ్బాయి చికిత్సకు అవసరమైన ఖర్చు భరిస్తానంటూ… pic.twitter.com/OetTfPxtWB
— ChotaNews (@ChotaNewsTelugu) December 23, 2024
కౌశిక్ తో ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండున్నర లక్షలు, సిఎం సహాయనిధి నుంచి 11 లక్షలు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు 40 లక్షలు ఇవ్వడం జరిగింది.ఇప్పుడు మిగతా అమౌంట్ ని ఎన్టీఆర్ కట్టడంతో కౌశిక్ హాస్పిటల్ నుంచి డీఛార్జ్ అయ్యాడు.