Sexual Assault Allegations on Anurag Kashyap: నన్ను అనురాగ్‌ కశ్యప్‌ రేప్ చేశాడు, తెలుగు నటి సంచలన వ్యాఖ్యలు, న్యాయం చేయాలంటూ ప్రధానికి ట్వీట్ ద్వారా వినతి, వ్యాఖ్యలపై స్పందించిన అనురాగ్ కశ్యప్

ఏకంగా ప్రధాని మోదీకి నటి ట్వీట్ ద్వారా మొరపెట్టుకుంది.‘అనురాగ్ కశ్యప్‌ నాపై బలాత్కారం చేశాడు. నరేంద్ర మోదీజీ... మీరు ఆయనపై చర్యలు తీసుకోవాలి. అతని వెనక ఉన్న అసలు నిజాలు దేశానికి తెలియజేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ విషయం చెప్పడం వల్ల ఆయన నుంచి నాకు ప్రమాదముంటుంది. దయచేసి సహాయం చెయ్యండి’ అని వేడుకుంటూ ఆమె ట్వీట్ చేశారు.

Anurag Kashyap (Photo Credit: Twitter)

అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అంతకుముందు పలుమార్లు లైంగికంగా నన్ను వేధించాడని ఓ తెలుగు నటి  సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకంగా ప్రధాని మోదీకి నటి   ట్వీట్ ద్వారా మొరపెట్టుకుంది.‘అనురాగ్ కశ్యప్‌ నాపై బలాత్కారం చేశాడు. నరేంద్ర మోదీజీ... మీరు ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఒక సృజనశీలి వెనక ఉన్న అసలు నిజాలు దేశానికి తెలియజేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ విషయం చెప్పడం వల్ల ఆయన నుంచి నాకు ప్రమాదముంటుంది. దయచేసి సహాయం చెయ్యండి’ అని వేడుకుంటూ ఆమె ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే ఆ‌ ట్వీట్‌ను నటి కంగనా రనౌత్ రీట్వీట్ చేశారు, ప్రతీ గొంతూ ముఖ్యమైనదే. అనురాగ్ కశ్యప్‌ను అరెస్ట్ చేయండి’ అని #మీ టూ’ హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె డిమాండ్‌ చేశారు. తెలుగు నటి ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ దీనిపై సమాచారమివ్వాల్సిందిగా ఆ నటిని కోరారు. ‘మీరు మీ ఫిర్యాదును ncw@nic.in, @NCWIndia ద్వారా నాకు పంపొచ్చు’ అని రేఖాశర్మ ట్వీట్‌ చేశారు. తన ట్వీట్‌ను సుమోటో ఫిర్యాదుగా స్వీకరించడంపై రేఖాశర్మకు ఆ తెలుగు నటి ధన్యవాదాలు తెలిపారు.

డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిని ప్రేమించడమే రియా తప్పు, మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను వేధించాయి, రియా అరెస్టుతో న్యాయం అపహాస్యమైందని తెలిపిన రియా తరపు లాయర్ తీష్ మనషిండే

ఇదిలా ఉంటే ఈ వివాదంపై కశ్యప్ స్పందించారు. నా నోరు మూయించడానికి మరో మహిళను ఉసిగొలుపుతున్నారని ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై అనురాగ్‌ కశ్యప్‌ రాత్రి 12.38 నిమిషాలకు హిందీలో రాసిన నాలుగు ట్వీట్ల ద్వారా స్పందించారు. భలే చెప్పారు. నా నోరు మూయించడానికి చాలా సమయం పట్టినట్టుంది’ అని రాశారు. ‘నా నోరు మూయించడానికి ఓ మహిళ మరో మహిళతో అబద్ధం చెప్పించారు. ఆమె ఇతర మహిళలను కూడా వివాదాల్లోకి లాగారు. మేడం కొంచెం మర్యాద కాపాడుకోండి . మీ ఆరోపణలన్నీ అబద్ధాలు’ అంటూ కశ్యప్‌ ఘాటుగా ట్వీట్‌ చేశారు.

Anurag Kashyap Tweets

నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నానని అంటున్నారు. అది మా ఇష్ట ప్రకారమే జరిగింది. మా మధ్య ప్రేమ ఉంది, అందుకే పెళ్లి చేసుకున్నాం’ అని కశ్యప్‌ పేర్కొన్నారు. నాకు ఒక భార్య ఉందా ? ఇద్దరు భార్యలున్నారా ? గర్ల్స్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారా ? అన్న విషయాలు ప్రస్తుతానికి అప్రస్తుతం. నేను చాలామంది మహిళలతో కలిసి పని చేస్తుంటాను. చాలామంది నటీమణులు నాకు తెలుసు.

గుండు సీక్రెట్ బయటకు..మెగాస్టార్ నిజంగా గుండు చేయించుకోలేదు, అది మేకింగ్ వీడియో, అర్బన్‌ మాంక్‌ లుక్ పేరుతో వీడియో బయటకు

వాళ్లతో కలిసి పదిమందిలో పని చేసినా, ఒంటరిగా పని చేసినా నేనెప్పుడూ చెడుగా ప్రవర్తించలేదు. ఎవరైనా అలా చేసినా కూడా నేను సహించలేను’ అని తన ట్వీట్ లో కశ్యప్ వ్యాఖ్యానించారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఆ వీడియోలో ఆమె చెప్పింది ఎంత నిజమో త్వరలోనే తేలుతుంది. ఈ ఆరోపణల నుంచి నేను బయటకొస్తాను’ అని కశ్యప్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలుగు నటి 2017 లో 'పటేల్ పంజాబీ షాదీ' చిత్రంలో నటుడు పరేష్ రావల్ కుమార్తెగా తొలిసారి కనిపించారు బాలీవుడ్‌ సినిమాలలో మాత్రం పెద్దగా కనిపించలేదు. దక్షిణాదిలో కొన్ని సినిమాలలో ఊసరవెల్లి, మిస్టర్‌ రాస్కెల్‌, ప్రయాణం తదితర సినిమాల్లో నటించారు. సాథ్‌ నిభానా, సాథియా 2 అనే టెలీవిజన్‌ షోలో ఆమె కనిపించారు.