సుశాంత్ మరణం కేసులో ఆయన స్నేహితురాలు, ప్రేమికురాలు అయిన రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) మంగళవారం అరెస్ట్ చేయడంపై (Rhea Chakraborty arrested by NCB) ఆమె తరుఫు న్యాయవాది సతీష్ మనషిండే (Rhea Chakraborty's lawyer Satish Maneshinde) స్పందించారు. రియా అరెస్టుతో న్యాయం అపహాస్యమైందని (this is travesty of justice) ఆయన అన్నారు. మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఎన్సీబీ ఒంటరి మహిళ అయిన రియా చక్రవర్తిని వేధింపులకు గురిచేశాయని ఆరోపించారు.
అనేక ఏండ్లుగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చట్టవిరుద్ధంగా ఇచ్చిన మందులు సేవించి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి సుశాంత్ అని దీనిపై రియాను వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌కు బానిస అయిన వ్యక్తి (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్)ని ప్రేమించడమే రియా చేసిన తప్పని ('Rhea Loved A Drug Addict') అన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వ్యక్తిని ప్రేమించినందుకే మూడు దర్యాప్తు సంస్థలు రియాను వెంటాడి వేధించాయని, చివరకు ఆమెను అరెస్ట్ చేశారని న్యాయవాది సతీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడుతామని ఆయన చెప్పారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో (Sushant Singh Rajout death case) విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్ (Rhea Chakraborty Arrested) చేశారు. డ్రగ్స్ కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్లు ఎన్‌సీబీ తెలిపింది. సాయంత్రం 4:30 గంటలకు రియాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
డ్రగ్స్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను ఎన్‌సీబీ నాలుగు రోజుల పాటు రియాను విచారించింది. విచారణలో ఆమె 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా సుశాంత్ సింగ్ మృతి చెందినప్పటి నుంచి పోలీసులు రియాను విచారిస్తున్నారు. దీనిలో భాగంగానే డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది.