Rhea Chakraborty (Photo Credits: Instagram)

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో (Sushant Singh Rajout death case) విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్‌ (Rhea Chakraborty Arrested) చేశారు. డ్రగ్స్‌ కేసులో ఆమెను అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌సీబీ తెలిపింది. సాయంత్రం 4:30 గంటలకు రియాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

డ్రగ్స్‌ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను ఎన్‌సీబీ నాలుగు రోజుల పాటు రియాను విచారించింది. విచారణలో ఆమె 25 మంది బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్‌‌ అయిన విషయం తెలిసిందే. కాగా సుశాంత్‌ సింగ్‌ మృతి చెందినప్పటి నుంచి పోలీసులు రియాను విచారిస్తున్నారు. దీనిలో భాగంగానే డ్రగ్స్‌ కేసు వెలుగులోకి వచ్చింది.

కాగా సుశాంత్‌ మృతితో వెలుగు చూసిన డ్రగ్‌ కేసులో కార్టెల్ ఎ, బి, సి కేటగిరీలకు సంబంధించిన 25 మంది బాలీవుడ్ ప్రముఖుల జాబితాను తాము సిద్ధం చేస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఉన్నతాధికారి తెలిపారు. వారి పేర్లను సుశాంత్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి విచారణలో వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విచారణను మరింత వేగవంత చేసిన ఎన్‌సీబీ అధికారులు రియా సోదరుడు షోవిక్‌ను అరెస్టు చేశారు.

కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం, నటి సంజన ఇంట్లో పోలీసులు సోదాలు, కేసులో విచారణను వేగవంతం చేసిన బెంగుళూరు సీసీబీ

రియా సూచనల మేరకు సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడని షోవిక్‌ విచారణలో వెల్లడించాడు. ఆయన ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే ఎన్‌సీబీ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే రియాకు చెందిన మొబైల్‌, ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటినుంచి కీలక ఆధారాలను సేకరించారు. అలాగే డ్రగ్స్‌ స్మగ్లర్ బాసిత్‌ను ఐదు సార్లు కలిసినట్టు రియా అంగీకరించడంతో మంగళవారం అరెస్ట్‌ చేశారు. అయితే రియా డ్రగ్‌ కేసులో బాలీవుడ్‌కు సంబంధం ఉన్నట్లు చెప్పడంతో పరిశ్రమలోని ప్రముఖులకు కూడా త్వరలో ఎన్‌సీబీ సమాన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్‌సీబీ అధికారులు సమీర్‌ వాంఖడే, కేపీఎస్‌ మల్హోత్రా ఆధ్వర్యంలో రియా విచారణ కొనసాగుతోంది.

ట్విస్టులతో సాగుతున్న సుశాంత్ డెత్ కేసు, రియా చుట్టూ మాదక ద్రవ్యాల ఉచ్చు, విచారణకు హాజరకావాలని ఆదేశించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో

బాలీవుడ్‌లో పలువురికి కూడా డ్రగ్స్‌ కేసులో ఉన్నారని, వారి పేర్లను, డ్రగ్స్‌ ఉపయోగించే పార్టీల జాబితాను రియా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా రియా కాల్‌ డేటాతో పాటు, స్వాధీనం చేసుకున్న పెడ్లర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాల డేటా అధారంగా బాలీవుడ్‌లోని ప్రముఖులకు కూడా కనెక్షన్‌లు ఉన్నట్లు ఇటీవల అధికారుల గుర్తించారు. తాజాగా రియా డ్రగ్‌ కేసులో బాలీవుడ్‌కు సంబంధం ఉన్నట్లు చెప్పడంతో పరిశ్రమలోని ప్రముఖులకు కూడా త్వరలో ఎన్‌సీబీ సమాన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే దివంగ‌త న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణానికి అత‌ని సోద‌రి ప్రియాంక సింగ్ కార‌ణ‌మంటూ రియా చక్ర‌వ‌ర్తి ఆరోపించిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఇద్ద‌రు అక్క‌లు ప్రియాంక సింగ్, నీతూ సింగ్ సుశాంత్‌కు సంబంధించిన బోగస్‌ మెడికల్‌ ప్రిస్కిప్షన్‌ను ఇచ్చార‌ని, ఆ మెడిసిన్ తీసుకున్న 5 రోజుల్లోనే సుశాంత్‌ మరణించాడని రియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు అత‌ని సిస్ట‌ర్స్ కార‌ణ‌మంటూ ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అంతేగాక ఢిల్లీలో రామ్‌ మనోహర్‌ లోహియా హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌ తరణ్‌పై కూడా రియా ఈ ఫిర్యాదులో పేర్కొంది. గ‌తంలో సుప్రీం ఆదేశాల మేర‌కు ప్ర‌స్తుతం ఈ కేసును దర్యాప్తు నిమిత్తం ముంబై పోలీసులు సీబీఐకి బదలాయించారు