Bobby Deol joins Hari Hara Veera Mallu: పవన్ ‘వీరమల్లు’లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.. ప్రకటించిన చిత్ర బృందం
ఇప్పుడు ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Hyderabad, Dec 25: జాగర్లమూడి క్రిష్ (Krish) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎం.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రంలో పవన్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) కీలక పాత్ర పోషిస్తున్నారు.
టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత
ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ లో పాల్గొనేందుకు ఆయన సెట్ కు వచ్చిన వీడియోను శనివారం విడుదల చేసింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ కనిపిస్తారని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన దర్బార్ సెట్లో పవన్, బాబీపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు క్రిష్ షెడ్యూల్ రూపొందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్జున్ రాంపాల్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.