Hyderabad, Dec 25: సీనియర్ సినీ నటుడు చలపతిరావు (Senior Actor Chalapathi Rao) ఈ తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు (TDP President Chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్ (Janasena President Pawan Kalyan) ఆవేదన వ్యక్తం చేశారు.
టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమ రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరమని చెప్పారు. చలపతిరావు మృతి సినీ పరిశ్రమకు (Movie Industry) తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. పవన్ కల్యాణ్ స్పందిస్తూ, ప్రముఖ నటులు చలపతిరావు కన్నుమూయడం బాధాకరమని చెప్పారు.
రాజీవ్ స్వగృహ టవర్లను అమ్మేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. నోటిఫికేషన్ విడుదల
ప్రతి నాయకుడి పాత్రల్లోనే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తనదైన శైలిలో సినీ అభిమానులను మెప్పించారని తెలిపారు. నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మించారని కొనియాడారు. ఒక తరానికి సినీ పరిశ్రమ ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా కాలం చేస్తుండటం దురదృష్టకరమని చెప్పారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రముఖనటులు చలపతిరావుగారి మృతి దిగ్భ్రాంతి కలిగించింది. వారంలో ఇద్దరు సినీ ప్రముఖులను కోల్పోవడం విషాదకరం. 1000కి పైగా సినిమాల్లో నటించిన చలపతిరావుగారు ఎన్టీఆర్ కు ఎంతో ప్రీతిపాత్రులు. చలపతిరావు గారి ఆత్మ శాంతికై ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/BCRYobu9S4
— N Chandrababu Naidu (@ncbn) December 25, 2022
శ్రీ చలపతి రావు గారు మృతి బాధాకరం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/1RdM7NS5BX
— JanaSena Party (@JanaSenaParty) December 25, 2022