Adipurush: ఆదిపురుష్ సినిమా ప్రదర్శన ఆలస్యం.. సౌండ్ సిస్టం సరిగా లేదంటూ అభిమానుల గొడవ.. కోపంతో థియేటర్ అద్దాలు పగలగొట్టిన వైనం.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని జ్యోతి థియేటర్‌లో ఘటన.. వీడియోతో
సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు సినిమాను ఆలస్యంగా ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఓ థియేటర్ అద్దాలు బద్దలుగొట్టారు.
Sangareddy, June 16: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా (Cinema) కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు సినిమాను ఆలస్యంగా ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఓ థియేటర్ (Theatre) అద్దాలు బద్దలుగొట్టారు. సౌండ్ సిస్టం సరిగా లేక, డైలాగులు అర్థం కావడం లేదంటూ మళ్లీ గొడవకు దిగారు. ఈ ఘటన సంగారెడ్డిలో జరిగింది.
అసలేమైందంటే?
రామచంద్రాపురం పరిధిలోని జ్యోతి థియేటర్‌లో ‘ఆదిపురుష్’ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అయితే, సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో యాజమాన్యంతో అభిమానులు గొడవకు దిగారు. థియేటర్ యాజమాన్యం వారికి సర్ది చెప్పి లోపలికి పంపింది. అయితే, సినిమా ప్రారంభమయ్యాక సౌండ్ సిస్టం సరిగా లేక, డైలాగులు అర్థం కావడం లేదంటూ ఫ్యాన్స్ మళ్లీ గొడవకు దిగారు. ఆగ్రహంతో ఊగిపోతూ థియేటర్ అద్దాలను పగలగొట్టారు. దీంతో సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితి చక్కబెట్టారు.